స్వీడన్ తీరంలో తేలిన రష్యా గూఢచారి తిమింగలం?

అవును, మీరు విన్నది నిజమే.2019లో నార్వేలో తిరిగిన బెలూగా తిమింగలం స్వీడన్( Sweden coast ) తీరంలో మళ్లీ కనువిందు చేసింది.ఇది రష్యన్ నావికాదళం ద్వారా శిక్షణ పొందిన గూఢచారి కావడం ఇపుడు పలు అనుమానాలకు దారితీస్తోంది.మానవ నిర్మిత జీను కారణంగా తిమింగలం రష్యా నావికాదళం ద్వారా శిక్షణ పొందిందని ఇపుడు చాలామంది ఊహాగానం చేస్తున్నారు.

 A Russian Spy Whale Washed Up On The Coast Of Sweden, Russian Spy Whale, Sweden-TeluguStop.com

నార్వేలోని ఉత్తర ప్రాంతంలోని ఫిన్‌మార్క్‌లో మొదటిసారిగా కనుగొనబడిన ఈ తిమింగలం 3 సంవత్సరాలకు పైగా నెమ్మదిగా నార్వేజియన్ తీరప్రాంతంలోని పైభాగానికి కదులుతున్నట్టు తెలుసుకున్నారు.

కాగా, ఇటీవలి నెలల్లో అకస్మాత్తుగా స్వీడన్‌ తీరంలో సంచరించడం కొసమెరుపు.ఆదివారం, స్వీడన్ యొక్క నైరుతి తీరంలో హన్నెబోస్ట్రాండ్‌లో తిమింగలం కనిపించింది.వన్ వేల్ సంస్థకు చెందిన ఒక సముద్ర జీవశాస్త్రవేత్త సెబాస్టియన్ స్ట్రాండ్( Sebastian Strand ) తిమింగలం తన సహజ వాతావరణం నుండి చాలా త్వరగా దూరంగా కదులుతున్నందున ఇది చాలా అస్పష్టంగా ఉందని తెలుసుకున్నాడు.

ఈ తిమింగలానికి 13-14 సంవత్సరాలు వయసు ఉంటుందని కూడా ఆయన పేర్కొన్నారు.

కాగా తిమింగలం మొదటిసారిగా నార్వేజియన్ ఆర్కిటిక్‌లో కనిపించినప్పుడు, నార్వేజియన్ డైరెక్టరేట్ ఆఫ్ ఫిషరీస్‌కు చెందిన సముద్ర జీవశాస్త్రవేత్తలు దీని నుండి మానవ నిర్మిత జీనును తొలగించడం కొసమెరుపు.కాగా ఈ తిమింగలం రష్యన్ గూఢచారి అనే అంతర్జాతీయ కుట్ర సిద్ధాంతానికి దారితీసినట్టు తెలుస్తోందని కొందరు అంటున్నారు.అయితే తిమింగలం రష్యన్ గూఢచారి అని మాస్కో ఎప్పుడూ ధృవీకరించలేదు.

ఎటువంటి అధికారిక స్పందన చేయకపోవడం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube