ఇద్దరు వార్డెన్లపై కేసు నమోదు

నల్గొండ జిల్లా:మునుగోడు బీసీ బాలికల హాస్టల్ వార్డెన్ స్వాధ్వి,బాలుర హాస్టల్ వార్డెన్ కరుణశ్రీ లపై శనివారం కేసు నమోదైనట్లు కులం వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్)నల్లగొండ జిల్లా జిల్లా సహాయ కార్యదర్శి బొట్టు శివకుమార్ తెలిపారు.

ఇద్దరూ కలిసి తనను గదిలో నిర్బంధించి అకారణంగా చేయి చేసుకున్నారని వంట మనిషి మల్లమ్మ నాలుగు రోజుల క్రితం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా, సమగ్ర విచారణ అనంతరం ఇద్దరు వార్డెన్లపై వివిధ సెక్షన్ ల కింద పోలీసులు కేసు నమోదు చేసినట్లు చెప్పారు.

ఇద్దరిపై సంబంధిత శాఖా అధికారులు శాఖాపరమైన చర్యలకు సిద్దమవుతున్నట్లు తెలుస్తుందన్నారు.

A Case Has Been Registered Against Two Wardens-ఇద్దరు వార్�
ప్రతీ ఒక్కరికి వ్యక్తిత్వ వికాసం ఎంతో అవసరం : సీఐ శ్రీను నాయక్

Latest Nalgonda News