నాని వేలు పెట్టాడట!

యువ హీరో నాని ఈ వారం ‘కృష్ణగాడి వీర ప్రేమగాధ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.ఈ సినిమాకు హను రాఘవపూడి దర్శకత్వం వహించాడు.14 రీల్స్‌ బ్యానర్‌లో ఈ సినిమాను ప్రముఖ నిర్మాతలు అనీల్‌ సుంకర్‌, రామ్‌ ఆచంట, గోపీ ఆచంటలు నిర్మించారు.‘అందాల రాక్షసి’ చిత్రం తర్వాత హను తెరకెక్కించిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.

 Nani Made Changes To Kvpg Script-TeluguStop.com

ఇక ఈ సినిమా కథ మరియు స్క్రీన్‌ప్లేలో నాని వేలు పెట్టినట్లుగా తెలుస్తోంది.

నాని గతంలో దర్శకత్వం శాఖలో వర్క్‌ చేసిన విషయం తెల్సిందే.ఆ అనుభవంను నాని ఈ సినిమాకు ఉపయోగించాడట.ఈ విషయాన్ని స్వయంగా నాని తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

తాను స్క్రిప్ట్‌ మేకింగ్‌లో దర్శకుడు హను రాఘవపూడికి సలహాలు సూచనలు ఇచ్చాను అని, ఆయనకు కూడా నేను ఇచ్చిన సలహాలు నచ్చడంతో వాడేశాడు అంటూ నాని చెప్పుకొచ్చాడు.నాని గతంలో నటించిన సినిమాలకు కూడా సలహాలు సూచనలు ఇచ్చాడు.

అయితే అప్పుడు మాత్రం పెద్దగా చెప్పింది లేదు.కాని ఈ సారి స్వయంగా నాని ఈ సినిమాకు నా సలహాలు ఉన్నాయి అని చెప్పడంతో అందరి దృష్టి ఈ సినిమాపై ఉంది.

ఈనెల 12న భారీ భారీ ఎత్తున ఈ సినిమాను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube