బీహార్లో నేరగాళ్ళు మంత్రులు అవుతారా?

మన దేశంలో నేరగాళ్ళు మంత్రులు అవడం కొత్త కాదు.రాష్ట్రాల అసెంబ్లీలకు, పార్లమెంటుకు ఎన్నికవుతున్న వారిలో నేరగాళ్ళ శాతం ఎక్కువగా ఉంది.

 50 Of Bihar’s 243 Lawmakers Have Criminal Cases-TeluguStop.com

ఎన్నికల్లో గెలిచిన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు నేరగాళ్ళలో ఇద్దరికో ముగ్గురికో పదవులు ఇవ్వక తప్పడం లేదు.నిండా మునిగిన వాడికి చలి ఏమిటన్నట్లు బోలెడు పోలీసు కేసులు ఉంది కూడా ఎన్నికల్లో గెలిచినప్పుడు మంత్రి పదవి ఇస్తే తప్పు ఏముంది అనుకునే పరిస్థితి ఏర్పడింది.

ఈ కల్చరును ఎవరూ వ్యతిరేకించడం లేదు.బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 50 మంది నేరగాళ్ళు గెలిచారు.

వీరిపై హత్య, హత్యా ప్రయత్నం, కిడ్నాప్, దాడులు ….ఇలా ఎన్నో కేసులు ఉన్నాయి.

అయినప్పటికీ వీరికి టిక్కెట్లు ఇవ్వడం, వారు గెలవడం జరిగిపోయింది.అనంత సింగ్ అనే క్రిమినల్ జైల్లో ఉండే గెలిచాడు.

అతనికి 18000 ఓట్ల మెజారిటీ వచ్చింది.ఇతని మీద 16 కేసులు ఉన్నాయి.

సత్య దేవ్ రామ్ అనే ఎమ్మెల్యే మీద హత్య కేసులు ఉన్నాయి.కేదార్నాథ్ సింగ్ , అమరేంద్ర పాండే అనే ఎమ్మెల్యేల మీద అనేక కేసులు ఉన్నాయి.

కేసులు ఉన్న ఎమ్మెల్యేలు తాము ఏ నేరాలు చేయలేదని చెబుతున్నారు.తమను అనవసరంగా కేసుల్లో ఇరికించారని అంటున్నారు.

నేరగాళ్ళు ఏ ఒక్క పార్టీకో పరిమితం కాలేదు.ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోయేది మహా కూటమి కాబట్టి ఆ మూడు పార్టీల్లోని నేరగాళ్ళలో కొంత మంది అయినా పదవులు పొందే అవకాశం ఉందని సమాచారం.

నేరగాళ్ళు మంత్రులై శాసనాలు చేసే దుర్గతి పట్టడాన్ని ఏమనుకోవాలి?

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube