టికెట్ ఇవ్వాల్సిందే : రాజీనామాలు బెదిరింపులతో ...

వైసీపీ అధినేత జగన్(CM YS JAGAN ) చేపట్టిన నియోజకవర్గాల పార్టీ ఇన్చార్జిల ప్రక్షాళన వ్యవహారం ఆ పార్టీలో పెద్ద దుమారాన్ని రేపుతోంది.

ముఖ్యంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలు జగన్ నిర్ణయం పై టెన్షన్ తో పాటు, అసంతృప్తి తో ఉన్నట్టుగా వ్యవహరిస్తున్నారు.

ఇప్పటికే కొంతమందికి టికెట్ లేదనే విషయాన్ని నేరుగా జగనే చెప్పేశారు.మరి కొంతమందికి ఆ విధంగా సంకేతాలు పంపించారు.

ఈ రోజు పార్టీకి చెందిన ఎమ్మెల్యేలకు తాడేపల్లి రావలసిందిగా జగన్ నుంచి పిలుపు అందింది.  దీంతో వైసిపి ఎమ్మెల్యేల్లో టెన్షన్ నెలకొంది .టికెట్ దక్కే అవకాశం లేదనే సంకేతాలు వెలువడిన నేపథ్యంలో పలువురు ఎమ్మెల్యేలు వారి అనుచరులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతున్నారు.తమకు టిక్కెట్ కేటాయించాల్సిందేనని పట్టుబడుతున్నారు.

తమ ఎమ్మెల్యేకి మళ్లీ సీటు ఇవ్వాల్సిందేనని,  లేకపోతే పార్టీకి రాజీనామాలు చేస్తామని వారి అనుచరులు ఆందోళనకు చేపడుతున్నారు.ఈ తరహా వ్యవహారాలు మరింత గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి.

Advertisement

ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలను పిలిచి టిక్కెట్ ఇవ్వడం క్లారిటీ ఇచ్చేయడంతో వారంతా ఇప్పుడు ఆందోళనకు దిగుతున్నారు.

తాజాగా ఏలూరు జిల్లా చింతలపూడి అభ్యర్థిని మారుస్తున్నారనే ప్రచారంతో 100 కార్ల తో తాడేపల్లికి చేరుకున్నారు చింతలపూడి ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజా అనుచరులు .పశ్చిమగోదావరి జిల్లా రీజినల్ కోఆర్డినేటర్ , ఎంపీ మిధున్ రెడ్డి ఇంటి వద్ద ఎలీజా అనుసరులు ఆందోళనకు దిగారు.మళ్లీ వైసీపీ టికెట్ ఎలిజా కే కేటాయించాలని వారు డిమాండ్ చేశారు .దీంతో వారిని పోలీసులు అడ్డుకోవడంతో అనుచరులు వాగ్వాదానికి దిగారు.ఇక సత్యసాయి జిల్లా పెనుకొండ ఎమ్మెల్యే శంకరనారాయణ( MLA sankaranarayana ) కు మద్దతుగా వైసిపి కార్యకర్తలు ఆందోళన చేపట్టారు.

శంకరనారాయణకి టికెట్ కేటాయించాలంటూ సోమందేపల్లి వైఎస్ఆర్ సర్కిల్ దగ్గర కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు .మంత్రి ఉష శ్రీ చరణ్ కు వ్యతిరేకంగా నినాదాలు చేపట్టారు.ఉషాశ్రీ వద్దు శంకరనారాయణ ముద్దు అంటూ ప్లకార్డులను ప్రదర్శించారు .

కళ్యాణదుర్గంలో ఉష శ్రీ చరణ్ కు టికెట్ ఇవ్వకపోవడంతో అక్కడ కార్యకర్తలు సానుకూలంగా స్పందిస్తూ సంబరాలు జరుపుకున్నారు అని, ఇప్పుడు పెనుగొండ టికెట్ ఉషాశ్రీ కి ఎలా ఇస్తారని శంకర్ నారాయణ వర్గం ప్రశ్నిస్తోంది .ఇదే విధంగా సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలోనూ వైసీపీ నాయకుల రాజీనామాలు కొనసాగుతున్నాయి.గాండ్లపెంట మండలంలో పదిమంది సర్పంచ్ లు,  నలుగురు ఎంపీటీసీలు ,ఎంపీపీ, వైస్ ఎంపీపీ, జడ్పీటీసీలు రాజీనామా చేశారు.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

సిట్టింగ్ ఎమ్మెల్యే సిద్ధారెడ్డికి సీటు దక్కే అవకాశం లేకపోవడంతో,  దానికి నిరసనగా వీరంతా రాజీనామాకు దిగారు.ఇక కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే టికెట్ విషయంలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది.

Advertisement

సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డికి టికెట్ ఇస్తేనే సహకరిస్తామని,  లేకపోతే మూకుమ్మడిగా పార్టీకి రాజీనామా చేస్తామంటూ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు హెచ్చరిస్తున్నారు.ఇంకా అనేక చోట్ల ఈ తరహా వ్యవహారాలు చోటు చేసుకుంటూ ఉండడంతో , వైసీపీలో టెన్షన్ నెలకొనగా ,  ప్రధాన ప్రతిపక్షం టిడిపి ఈ పరిణామాలను తమకు అనుకూలంగా మార్చుకునే పనిలో నిమగ్నమైంది.

తాజా వార్తలు