దెబ్బతిన్న రహదారులకు నిరసనగా టీడీపీ-జనసేన ఆందోళన

ఎన్టీఆర్ జిల్లా: “గుంతల ఆంధ్రప్రదేశ్‍కు దారేది” పేరుతో గడ్డమనుగులో నిరసన కార్యక్రమం.దెబ్బతిన్న రహదారులకు నిరసనగా టీడీపీ-జనసేన ఆందోళన.

 Tdp Janasena Protest On Damaged Roads In Ap, Tdp Janasena Protest ,damaged Roads-TeluguStop.com

గడ్డమనుగు నుండి జి కొండూరు వరకు పాదయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించిన తెదేపా నేత మాజీ మంత్రి దేవినేని ఉమా, జనసేన ఇంఛార్జి అక్కల రామ్మోహన్ రావు (గాంధీ) టిడిపి – జనసేన నేతలు.దేవినేని ఉమా కామెంట్స్.

టిడిపి హయాంలో చంద్రబాబు కృషితోనే రహదారులకు మహర్ధశ.దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో రూ.5,694 కోట్లతో 23,553 కి.మీ.రోడ్లు వేసి గ్రామాలను పట్టుకొమ్మలుగా తీర్చిదిద్దారు.

రూ.12వేల కోట్ల బి.టి రహదారులకు పనులు చేపట్టి రూ.2,599 కోట్లతో గ్రామాల్లో బీటీ రోడ్డు వేశాం.పట్టణాల్లో 2,772 కి.మీ.రహదారులు నిర్మించారు.రూ.7,525 కోట్లతో మరో 5,882 కి.మీ.రహదారులు వివిధ దశల్లో ఉన్నాయి.మరో 8వేల సి.సి రోడ్లు నిర్మాణంలో ఉండగా జగన్ రెడ్డి వాటన్నింటిని రద్దు చేశాడు.రాజధాని అమరావతికి రాయలసీమను అనుసంధానించేలా 25వేల కోట్లతో అనంతపురం-అమరావతి ఎక్స్ ప్రెస్ హైవే ను టీడీపీ హయాంలోనే ప్రతిపాదిస్తే జగన్ రెడ్డి నిర్వీర్యం చేశారు.విజయవాడలో బెంజ్ సర్కిల్, కనకదుర్గ ఫ్లైఓవర్ పనులు టీడీపీ చేస్తే ప్రారంభోత్సవం జగన్ రెడ్డి చేశారు.

టీడీపీ 5 ఏళ్లల్లో సీసీ రోడ్లు, బీటీ రోడ్ల కోసం రూ.3,160.38 ఖర్చు చేశారని ప్రచురించింది.అదే వైసీపీ రూ.4,492.99 కోట్లు వ్యయం చేసిందని సాక్షి లో తప్పుడు కథనాలు ప్రచురించి ప్రజలను మోసం చేసారు.గత ఏడాది 2022 జూన్ 25న ఇదే రోడ్డులో గుంతలు పుడ్చమని జగన్మోహన్ రెడ్డి కళ్ళు తెరిపించేలా దుగ్గిరాలపాడు నుండి కొండూరు వరకు పాదయాత్ర చేసాం.టిడిపి హయాంలో మంజూరైన పనులను క్యాన్సిల్ చేసి కొత్తగా శంకుస్థాపనలు పేరిట ఎమ్మెల్యే సన్నాసి వసంత కృష్ణ ప్రసాద్ ఆర్భాటం చేశాడు.

ఇప్పటికీ ఈ రోడ్డు దుస్థితి ఇలానే ఉంది.

ఇంత అసమర్ధ, చేతకాని దద్దమ్మ ఎమ్మెల్యే ఈ ప్రాంతానికి అవసరమా ? మళ్లీ ఏ మొఖం పెట్టుకుని ఓట్లు అడగడానికి వస్తున్నారు.కొద్ది రోజుల క్రితం రెడ్డిగూడెం రంగాపురం వద్ద గుంతల కారణంగా ఒక పెద్దాయన (బిసి) మరణించాడు 45 ఏళ్ల యువకుని మరణంతో కుటుంబం రోడ్డు పాలైంది.ఈ రోడ్డులో గుంతలు పూడ్చడానికి ఒక లారీ గ్రావెల్ తెచ్చి కార్యక్రమం చేస్తుంటే వసంత కృష్ణ ప్రసాద్ పోలీసులను పంపి కార్యక్రమం అపుతున్నారు.

మీకు చేతకాదు చేయలేరు మేము చేసి చూపిస్తే డ్రైవర్ను బెదిరించి కేసులు పెడతామంటున్నారు అన్నం తింటున్నారా ? గడ్డి తింటున్నారా ?

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube