ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కృష్ణాజిల్లాలో ఇటీవల వాలంటీర్లకు ప్రధానోత్సవ బహుమతులు కార్యక్రమం స్టార్ట్ చేయడం తెలిసిందే.ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో ప్రజాప్రతినిధుల సమక్షంలో జరుగుతున్న క్రమంలో తాజాగా విజయనగరం జిల్లాలో డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి ఆధ్వర్యంలో ఉత్తమమైన సేవలు అందించిన వాలంటీర్లను గుర్తించి సత్కరించడం జరిగింది.
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి సంచలన కరమైన కామెంట్ చేశారు.
కొంత మంది వాలంటీర్లు ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వానికి మరియు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆశయాలకు వ్యతిరేకంగా పని చేస్తున్నారని కాంట్రవర్సి కామెంట్లు చేశారు.
కొరకు మండలంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసిన పరిస్థితులు ఉన్నాయని పేర్కొన్నారు.గరుగుబిల్లి మండలంలో ఒక వాలంటీర్ భర్త ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్నికల్లో పోటీ చేశారని స్పష్టం చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా అందరూ కాకపోయినా 90% మంది అనుకూలంగా ఉంటే 10 శాతం మాత్రం ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాలంటీర్లు వ్యవహరిస్తున్నారు అని ఆమె అన్నారు.ఏది ఏమైనా వాలంటీర్లకు గుర్తింపు లభించింది అంటే అది సీఎం జగన్ ఆలోచనల వల్లనే అది గుర్తుపెట్టుకుని సేవలు అందించాలని డిప్యూటీ సీఎం శ్రీ వాణి స్పష్టం చేశారు.