మరోసారి ఆస్తుల అటాచ్మెంట్

ఆస్తుల అటాచ్మెంట్ అనగానే టక్కున గుర్తుకు వచ్చే నాయకుడు వై కా పా అధినేత వై ఎస్ జగన్.అక్రమాస్తుల కేసులో, మనీ లాండరింగ్ కేసులో నిందితుడైన జగన్ ఆస్తుల్లో కొన్నింటిని ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మరోసారి అటాచ్ (జప్తు) చేసారు.

 Ed Attaches Rs 7.85 Crore Assets Of Jagan Reddy And Others-TeluguStop.com

ఈ ఆస్తులను అమ్మకూడదు, కొనకూడదు.మనీ లాండరింగ్ కేసులో జగన్, ఇతర నిందితుల ఆస్తులు సుమారు 8 కోట్ల విలువైనవి అటాచ్ చేసారు.కరక్టుగా చెప్పాలంటే 7.85 కోట్ల విలువైన ఆస్తులు జప్తు చేసారు.ఈ ఆస్తుల్లో పెన్నా సిమెంట్, పయనీర్ హాలిడే రిసార్ట్స్ యజమానుల ఆస్తులు కూడా ఉన్నాయి.తెలంగాణా, ఆంద్రలో ఉన్న పలు స్తిరాస్తులను అధికారులు అటాచ్ చేసారు.ఉమ్మడి రాష్ట్రంలో ఈ కంపెనీలు ప్రభుత్వం నుంచి అనుచిత ప్రయోజనాలు పొంది జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి.దీన్నే క్విడ్ ప్రో కో అంటున్నాము.

సీబీఐ చార్జిషీటు ఆధారంగా ఈడీ కేసులు నమోదు చేసింది.జగన్, ఇతర నిందితులపై 2010లో మనీ లాండరింగ్ కింద కేసులు నమోదు చేసారు.

ఈడీ ఇదివరకే వెయ్యి కోట్ల విలువ గల ఆస్తులు అటాచ్ చేసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube