నేరం రుజువైంది...రాజీనామా చేయాలి

నోటుకు ఓటు కుంభకోణంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రుజువైంది కాబట్టి ఆయన వెంటనే రాజీనామా చేయాలట…! టీడీపీకి బద్ధ శత్రువైన వైఎస్సార్‌సీపీ డిమాండ్‌ ఇది.చంద్రబాబు ముఖ్యమంత్రి పదవికి వెంటనే రాజీనామా చేయాలని వైకాపా నాయకుడు అంబటి రాంబాబు డిమాండ్‌ చేశారు.

 Chandrababu Should Resign-TeluguStop.com

నోటుకు ఓటు వ్యవహారంలో చంద్రబాబు పాత్ర ఉందని నామినేటెడ్‌ ఎమ్మెల్యే ఎల్విస్‌ స్టీఫెన్‌సన్‌ ఏసీబీ కోర్టులో స్పష్టంగా చెప్పారని, కాబట్టి నేరం రుజువైందని, వెంటనే రాజీనామా చేయాలని రాంబాబు అన్నారు.రేవంత్‌ రెడ్డి అవినీతి పనికి చంద్రబాబు మద్దతు ఇచ్చారు కాబట్టి ఈయన కూడా అవినీతిపరుడేనని అన్నారు.

నోటుకు ఓటు వ్యవహారంలో తమ వైఖరి ఏమిటో భాజపా స్పష్టం చేయాలని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడిని డిమాండ్‌ చేశారు.బాబు నేరం చేశాడని, అది రుజువైందని కోర్టు చెప్పాలి.

రాంబాబు డిమాండ్‌ చేస్తే బాబు రాజీనామా చేస్తారా? డిమాండ్‌ తీర్పు కాదు కదా…! వైకాపా మరీ ఇంత తొందర పడాల్సిన అవసరంలేదు.వ్యవహారం కోర్టులో ఉంది కాబట్టి త్వరలోనే తీర్పు వస్తుంది.

దాన్నిబట్టి బాబు ఏం చేస్తాడో చూడాలి.బాబు నేరగాడని కోర్టు చెబితే బాబు రాజీనామా చేయాల్సిందే.

చేయకపోతే అప్పుడు వైకాపా పెద్ద ఉద్యమమే నిర్వహించవచ్చు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube