మూడు నెలల్లో 7 సినిమాలు

మూడు నెలల గ్యాప్‌లో 7 సినిమాలను విడుదల చేయడం ఏ హీరోకు కాని, హీరోయిన్‌కు కాని సాధ్యపడని విషయం.కమెడియన్స్‌ లేదా క్యారెక్టర్‌ ఆర్టిస్టులకు అది సాధ్యం అవుతుంది.

 Nayanthara Coming With 7 Movies In 3 Months-TeluguStop.com

అయితే మూడు నెలల గ్యాప్‌లో 7 సినిమాలతో రాబోతుంది ఏ కమెడియనో లేక క్యారెక్టర్‌ ఆర్టిస్టు కాదు.సౌత్‌ స్టార్‌ హీరోయిన్‌ నయనతార.

ఈ అమ్మడు తమిళంలో ప్రస్తుతం ఏడు సినిమాలతో బిజీగా ఉంది.ఆ ఏడు సినిమాలు కూడా కేవలం మూడు నెలల గ్యాప్‌లోనే వరుసగా రాబోతున్నాయి.

తెలుగు సినిమాలకు దూరం అయిన నయన్‌ గత కొంత కాలంగా తమిళ ఇండస్ట్రీకే పరిమితం అయ్యింది.

తమిళంలో ఈమె స్టార్‌ హీరోల సినిమాల్లో నటించడంతో పాటు చిన్న హీరోల సరసన, హీరోయిన్‌ ఓరియంటెడ్‌ సినిమాల్లో కూడా నటిస్తూ మొత్తం ఏడు సినిమాలను విడుదలకు సిద్దం చేసింది.

ప్రభుదేవాతో ప్రేమకు స్వస్థి చెప్పిన తర్వాత సినిమాలకు దూరం అవ్వాలని భావించినా కూడా కొన్ని కారణాల వల్ల సినిమాల్లో కొనసాగుతూ వస్తోంది.ప్రేమ విషయాల నుండి బయట పడేందుకు వరుసగా సినిమాలు ఒప్పుకుంటూ బిజీ బిజీగా మారింది.

అలా ఏడు సినిమాలు చేసింది.ఆ ఏడు సినిమాలు కూడా నయన్‌కు మంచి పేరు తెచ్చి పెట్టే సినిమాలే అని తమిళ సినీ జనాలు అంటున్నారు.

మూడు నెలల గ్యాప్‌లో ఏడు సినిమాలను విడుదల చేస్తున్న హీరోయిన్‌గా ఈమె రికార్డు సృష్టిస్తుంది.ఇటీవల కాలంలో ఇలాంటి ఫీట్‌ సాధించింది ఎవ్వరు లేరు అని చెప్పక తప్పదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube