తండ్రి రిక్షావాలా.. డీఎస్సీ సాధించిన కొడుకు.. ఇతని సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

ప్రభుత్వ ఉద్యోగం సాధించడం అనేది కొన్ని కోట్ల మంది కల అనే సంగతి తెలిసిందే.ఈ కలను నెరవేర్చుకోవడం సులువైన విషయం కాదు.

 Mudavat Ganesh Inspirational Success Story Details Inside Goes Viral In Social M-TeluguStop.com

అయితే ఒక యువకుడు మాత్రం తండ్రి రిక్షా తొక్కి కష్టపడి చదివించగా తన లక్ష్యాన్ని సులువుగా సాధించాడు.పోటీలో ఎంతమంది ఉన్నా కష్టపడితే కోరుకున్నది సాధించవచ్చని ప్రూవ్ చేశాడు.

ముడావత్ గణేశ్ సక్సెస్ స్టోరీ ప్రస్తుతం సోషల్ మీడియా( Social media )లో వైరల్ అవుతోంది.

Telugu Inspirational, Mudavat Ganesh, Story, Telangana, Telangana Dsc-Inspiratio

ముడావత్ గణేశ్ కు ఈ సక్సెస్ సులువుగా దక్కలేదు.ఎన్నో అపజయాలు, ఎన్నో ఒడిదొడుకుల వల్ల కెరీర్ పరంగా గణేశ్ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవడం జరిగింది.గణేశ్ సక్సెస్ కావడం కోసం కుటుంబ సభ్యులు సైతం తమ వంతు సహాయ సహకారాలు అందించారు.

ఎట్టకేలకు ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్న అతని కల చివరకు నెరవేరింది. తెలంగాణ డీఎస్సీ 2024 ఫలితాల్లో ( Telangana DSC 2024 Results )ఎస్టీ విభాగంలో ఎస్టీజీ జాబ్ సాధించి ఎంతోమందికి గణేశ్ స్పూర్తిగా నిలిచారు.

Telugu Inspirational, Mudavat Ganesh, Story, Telangana, Telangana Dsc-Inspiratio

గణేశ్ తండ్రి పేరు ముడావత్ పంతులు కాగా ఈయన రిక్షా తొక్కి ఎంతో కష్టపడి కుటుంబాన్ని పొషించారు.గణేశ్ తల్లి పండ్లు అమ్ముతూ కుటుంబానికి అండగా నిలిచారు.పంతులు దంపతులకు నలుగురు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు.గణేశ్ చిన్న కొడుకు కాగా గణేశ్ ఉద్యోగం సాధించడం కుటుంబ సభ్యులకు ఎంతో ఆనందాన్ని కలిగించింది.ఫ్యామిలీ, టీచర్స్ సపోర్ట్ వల్లే తాను లక్ష్యాన్ని సాధించడం సాధ్యమైందని గణేశ్ చెబుతున్నారు.ఎలాంటి పరిస్థితుల్లో అయినా చదువును మాత్రం అశ్రద్ధ చేయవద్దని గణేశ్ వెల్లడించారు.

కష్టపడి లక్ష్యాన్ని సాధిస్తే లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండవచ్చని ఆయన పేర్కొన్నారు.గణేశ్ ( Mudavat ganesh )మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

గణేశ్ సక్సెస్ ఎంతొమందికి స్పూర్తిగా నిలుస్తుందని చెప్పడంలో సందేహం అక్కర్లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube