బీజేపీ లో బీఆర్ఎస్ విలీనం ... కేంద్ర మంత్రి ఏమన్నారంటే ? 

చాలా కాలంగా తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కేంద్ర అధికార పార్టీ బిజెపిలో విలీనం కాబోతుందనే వార్తలు వస్తూనే ఉన్నాయి.బీఆర్ఎస్ నుంచి పెద్ద ఎత్తున నాయకులు వలస వెళుతుండడంతో , తప్పనిసరి పరిస్థితుల్లో బిజెపిలో పార్టీని విలీనం చేసేందుకు కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని,  దానిలో భాగంగానే పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపికి అన్ని విధాలుగా సహకరించడంతోనే బీఆర్ఎస్ ఒక్క స్థానంలో కూడా గెలవ లేకపోయిందనే విమర్శలు పదేపదే కాంగ్రెస్ నేతలు చేస్తున్నారు.

 Brs In Bjp... What Is The Union Minister?bjp, Brs, Congress, Telangana Election-TeluguStop.com

  తాజాగా బిజెపిలో బీఆర్ఎస్ విలీనం అంశంపై కేంద్రమంత్రి బండి సంజయ్ స్పందించారు.బిజెపిలో బీఆర్ఎస్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ కలుపుకునే ప్రసక్తి లేదని సంజయ్ అన్నారు.

ఒకవేళ బీఆర్ఎస్ ను బిజెపిలో కలుపుకుంటే కెసిఆర్ , కేటీఆర్ , హరీష్ రావు కవితకు టికెట్లు ఇవ్వాలంటూ సెటైర్లు వేశారు.

Telugu Bandi Sanjay, Congress, Himanshu, Karthik Reddy, Kavitha, Telangana-Polit

అంతేకాదు కేటీఆర్( KTR ) కుమారుడు హిమాన్షు కూడా ఎన్నికల్లో టికెట్ కావాలంటాడని సంజయ్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.అలా అందరికీ టిక్కెట్లు ఇవ్వడానికి బిజెపి కుటుంబ పార్టీ కాదని అన్నారు .” కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాట ముచ్చట అయిపోయింది త్వరలో కలిసిపోతాయి” అంటూ బండి సంజయ్( Bandi Sanjay Kuma) కౌంటర్ ఇచ్చారు.బీఆర్ఎస్,  బిజెపి ఒక్కటేనన్న కాంగ్రెస్ ప్రచారాన్ని ప్రజలు నమ్మడం లేదని సంజయ్ అన్నారు .38 మంది ఎమ్మెల్యేల బలమున్న బీఆర్ఎస్ రాజ్యసభ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయలేదని సంజయ్ ప్రశ్నించారు.బఆర్ఎస్ పార్టీ మెడలు వంచి గడీలు బద్దలు కొట్టింది బిజెపి మాత్రమేనని అన్నారు.

Telugu Bandi Sanjay, Congress, Himanshu, Karthik Reddy, Kavitha, Telangana-Polit

 తాజాగా ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ కూడా స్పందించింది.  ఈ మేరకు బిజెపి , కాంగ్రెస్ పార్టీల కలయిక కెసిఆర్ ను  దెబ్బ కొట్టడానికేనని బీఆర్ఎస్ నేత పటోళ్ల కార్తీక్ రెడ్డి( Karthik Reddy ) అన్నారు .ఈ మేరకు బీఆర్ఎస్ కార్యాలయంలో మాట్లాడిన ఆయన రాష్ట్రానికి నిధులు తీసుకురావడంలో బిజెపితో కాంగ్రెస్ దోస్తీ ఉండదని ఆరోపించారు.కేంద్రం నుంచి రాష్ట్రాలకు వచ్చే నిధుల అంశంలో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని,  తెలంగాణకు కాకుండా పక్క రాష్ట్రానికి కేంద్రం నిధులు కట్టబెట్టిందని , మన రాష్ట్రానికి నిధులు రాకపోవడం కాంగ్రెస్ వైఫల్యం అని ఆయన విమర్శించారు.  తెలంగాణ మీడియా సంస్థలు తెలంగాణకి రుణపడి ఉండాలని , మన రాష్ట్రానికి అన్యాయం జరిగితే మీడియా సంస్థలు ప్రశ్నించాలని పటోళ్ల అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube