కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి వీరిలో ఎవరో ? గెలుపు ధీమా ఉందా ? 

విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలను అటు టిడిపి కూటమితో( TDP Alliance ) పాటు ఇటు వైసిపి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసిపి ఓటమి చెందిన తరువాత మొదటిసారిగా జరుగుతున్న ఎన్నికలు కావడంతో అధికార కూటమి పార్టీలైన టిడిపి ,జనసేన, బిజెపిలో ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకావడంతో వైసీపీ వ్యూహాత్మకంగా సీనియర్ పొలిటిషన్ బొత్స సత్యనారాయణ ను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ముందుగానే ప్రకటించింది.ఉత్తరాంధ్రలో గట్టి పట్టున్న నేతగా పేరు ఉన్న బొత్స ను  ఢీ కొట్టగల వ్యక్తిని కూటమి తరుపున అభ్యర్థిగా నిలబెట్టేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

 Tdp Alliance Candidates Favorite For Visakha Local Body Mlc Elections Details, T-TeluguStop.com
Telugu Ap, Chandrababu, Gandi Babji, Janasena, Janasenani, Mlc, Pavan Kalyan, Pe

ఈ నేపథ్యంలోనే అనకాపల్లి టిడిపి నేత పీలా గోవింద్ తో( Peela Govind ) పాటు,  పెందుర్తి నేత గండి బాబ్జీ( Gandi Babji ) ఎమ్మెల్సీ టికెట్ కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నారు.టికెట్ తనకే అన్న నమ్మకంతో ఈ ఇద్దరు  నేతలు ఉన్నారు.ఎమ్మెల్సీ ఎన్నికల్లో( MLC Elections ) వైసీపీ తరఫున వంశీకృష్ణ శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి పూర్తిస్థాయిలో మెజార్టీ ఉండడంతో టిడిపి అప్పట్లో పోటీకి ఎవరిని నిలబెట్టలేదు.అయితే ఇప్పుడు అంతే స్థాయిలో వైసిపి బలం ఉన్నా .మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వైసీపీకి చెందిన స్థానిక సంస్థల ఓటర్లు టిడిపి కూటమి వైపు మొగ్గు చూపుతారనే ఆశలు ఉన్నాయి.ఇటీవల కాలంలో వైసీపీ నుంచి గెలిచిన కార్పొరేటర్లు చాలామంది టిడిపిలో చేరిపోయారు.

Telugu Ap, Chandrababu, Gandi Babji, Janasena, Janasenani, Mlc, Pavan Kalyan, Pe

ఈ ఎన్నికలలో టిడిపి కూటమి అభ్యర్థికి చాలామంది వైసీపీకి చెందిన స్థానిక సంస్థల ఓటర్లు మద్దతు తెలుపుతారని , టిడిపి కూటమి ఆశలు పెట్టుకుంటుంది.దీంతో అప్పుడే వైసిపి తమ స్థానిక సంస్థల ఓటర్లను క్యాంపులకు తరలించేందుకు ఏర్పాట్లు చేసుకుంటోందట.ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ ను గెలిపించుకుని అధికార పార్టీపై విజయం సాధించాలనే పట్టుదలతో జగన్ ఉండగా,  అంతే స్థాయిలో రాజకీయ వ్యూహాలు రచించే పనుల్లో కూటమి పార్టీలు ఉన్నాయి.  ఈ మేరకు వైసీపీకి చెందిన స్థానిక సంస్థల ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు అనేక రాజకీయ వ్యూహాలు,  ప్రలోభాలకు సిద్ధమవుతున్నాయి కూటమి పార్టీలు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube