ఒక్కోసారి నీరసం( Fatigue ) ఉక్కిరిబిక్కిరి చేసేస్తుంటుంది.నీరసం కారణంగా ఏ పని చేయలేకపోతుంటారు.
రోజంతా నిరుత్సాహంగా ఉంటారు.వైరల్ ఫీవర్స్, పోషకాహార లోపం, పలు ధీర్గకాలిక వ్యాధులు తదితర అంశాలు నీరసం తలెత్తడానికి కారణాలు అవుతుంటాయి.
అయితే నీరసాన్ని తరిమి కొట్టడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి.ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే వండర్ ఫుల్ జ్యూస్ ను రోజు ఉదయం కనుక తీసుకుంటే ఎలాంటి నీరసం అయినా పరార్ అవుతుంది.
మరి ఇంతకీ ఆ జ్యూస్ ఏంటి.దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.
అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా బ్లెండర్ తీసుకుని అందులో ఒక కప్పు బొప్పాయి పండు ముక్కలు( Papaya ) వేసుకోవాలి.
అలాగే ఒక అరటి పండును( Banana ) స్లైసెస్ గా కట్ చేసి వేసుకోవాలి.అర కప్పు పీల్ తొలగించి సన్నగా తరిగిన కీర దోసకాయ( Cucumber ) ముక్కలు, ఒక స్పూన్ తేనె మరియు ఒక గ్లాసు ఫ్రెష్ కొబ్బరి నీళ్లు వేసుకుని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి.
దాంతో మన జ్యూస్ అనేది సిద్ధం అవుతోంది.ఈ బొప్పాయి అరటి కీరా జ్యూస్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
ఈ జ్యూస్ లో ప్రోటీన్లు, విటమిన్స్, మినరల్స్, ఫైబర్ మెండుగా ఉంటాయి.వారం పది రోజులపాటు రోజు ఉదయం ఈ జ్యూస్ ను కనుక తీసుకుంటే ఎలాంటి నీరసం అయినా పరారవుతుంది.శరీరం శక్తివంతంగా మారుతుంది.డీహైడ్రేషన్ సమస్య ఉంటే దూరం అవుతుంది.అలాగే ఈ జ్యూస్ రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది.అనారోగ్యం మరియు ఇన్‌ఫెక్షన్లను నివారిస్తుంది.
ఈ బొప్పాయి అరటి కీరా జ్యూస్ లో పొటాషియం, మినరల్స్ మరియు ఎలక్ట్రోలైట్స్ పుష్కలంగా ఉంటాయి.ఇవి మీ గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడతాయి.వ్యాయామం తర్వాత కండరాలు పునరుద్ధరించడానికి కూడా మీరు ఈ జ్యూస్ ను తీసుకోవచ్చు.అంతేకాదు విటమిన్ ఎ, విటమిన్ ఇ, లుటిన్ మరియు యాంటీఆక్సిడెంట్లు మెండుగా ఉన్నందున ఈ జ్యూస్ ఇవి మీ దృష్టిని ఆరోగ్యంగా ఉంచడంలో చాలా అద్భుతంగా తోడ్పడుతుంది.