ఆరెంజ్ తొక్కలతో అదిరిపోయే ఫేస్ సీరం.. రోజు వాడితే సూపర్ బెనిఫిట్స్ మీ సొంతం!

పిల్లల నుంచి పెద్దల వరకు చాలా మంది ఇష్టంగా తినే ఫ్రూట్స్ లో ఆరెంజ్( Orange ) ముందు వరుసలో ఉంటుంది.ఈ సిట్రస్ పండు ఇమ్యూనిటీని పెంచడంలో, వివిధ రకాల జబ్బుల నుంచి రక్షించడంలో చాలా బాగా సహాయపడుతుంది.

 How Make Face Serum With Orange Peel Details, Orange Peel, Orange Peel Benefits-TeluguStop.com

అయితే ఆరెంజ్ పండ్లను తినే క్రమంలో తొక్కను తొలగించి డస్ట్ బిన్ లోకి తోసేస్తుంటారు.కానీ ఆరెంజ్ పండులోనే కాదు తొక్కలో కూడా ఎన్నో పోషకాలు ఉంటాయి.

ఆరెంజ్ తొక్కలతో అదిరిపోయే ఫేస్ సీరంను( Face Serum ) తయారు చేసుకోవచ్చు.

అందుకోసం ముందుగా ఒక ఆరెంజ్ పండు తీసుకుని సాల్ట్ వాటర్ తో శుభ్రంగా వాష్ చేయాలి.

ఆపై తొక్కను సపరేట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో కట్ చేసుకున్న ఆరెంజ్ తొక్కలు( Orange Peel ) వేసుకోవాలి.

అలాగే అర కప్పు రోజ్ వాటర్ వేసుకుని నైట్ అంతా నానబెట్టుకోవాలి.మరుసటి రోజు మిక్సీ జార్ లో నానబెట్టుకున్న ఆరెంజ్ తొక్కలను వేసి మెత్తగా గ్రైండ్ చేసి జ్యూస్ సపరేట్ చేసుకోవాలి.

Telugu Tips, Face Serum, Skin, Latest, Orange Peel, Orangepeel, Serum, Skin Care

ఈ జ్యూస్ లో వన్ టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్,( Coconut Oil ) వన్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్, వన్ టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ మరియు చిటికెడు ఆర్గానిక్ పసుపు వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటే మన ఆరెంజ్ పీల్ సీరం అనేది సిద్ధమవుతుంది.రెగ్యులర్ గా ఈ సీరంను కనుక వాడితే సూపర్ బెనిఫిట్స్ మీ సొంతం అవుతాయి.

Telugu Tips, Face Serum, Skin, Latest, Orange Peel, Orangepeel, Serum, Skin Care

నైట్ నిద్రించే ముందు ముఖానికి ఏమైనా మేకప్ ఉంటే తొలగించి వాటర్ తో ఫేస్ వాష్ చేసుకోవాలి.ఆపై తయారు చేసుకున్న సీరం ను ముఖానికి అప్లై చేసుకుని పూర్తిగా ఆరిన తర్వాత నిద్రించాలి.ఈ ఆరెంజ్ పీల్ సీరం ను వాడటం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది.మచ్చలు ఏమైనా ఉంటే తగ్గుముఖం పడతాయి.బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ తొల‌గిపోతాయి.స్కిన్ కలర్ ఇంప్రూవ్ అవుతుంది.

పిగ్మెంటేషన్ సమస్య నుంచి విముక్తి లభిస్తుంది.మరియు ఈ సీరం మీ ఫేస్ ను బ్యూటిఫుల్ గా మరియు సూపర్ షైనీ గా మెరిపిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube