బిర్యానీలో బొద్దింక దర్శనం.. మెరిడియన్ రెస్టారెంట్‌ లో రచ్చ రచ్చ..

హైదరాబాద్‌(Hyderabad )లోని హోటళ్లు ఆహార నాణ్యత, శుభ్రతను పట్టించుకోవడం లేదని తాజాగా మరో సంఘటన బయట పడింది.ప్రముఖ హోటళ్లలో మురికిపోయిన, పురుగులు పడిన ఆహారాన్ని వడ్డించిన ఘటనలు సంబంధించిన అనేక వీడియోలో ఈ మధ్య మీడియా ద్వారా తెలుసుకుంటూనే ఉన్నాము.

 Sighting Of Cockroach In Biryani In Meridian Restauran, Viral Video, Social Medi-TeluguStop.com

హైదరాబాద్ నది ఒడ్డున ఉన్న పంజాగుట్ట మెరిడియన్ రెస్టారెంట్‌లో వడ్డించిన బిర్యానీలో ఓ బొద్దింక దొరికింది.దీన్ని గమనించిన కస్టమర్ యాజమాన్యానికి కంప్లైంట్ చేసాడు.

కానీ., హోటల్ యజమాని నిర్లక్ష్యం వహించాడు.

బాధితుడు బిర్యానీలో బొద్దింక ఉన్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా( Social media )లో వైరల్ గా మారింది.యాజమాన్యం సరిగా సంధానం ఇవ్వకపోవడంతో ఆగ్రహించిన బాధితుడు., బిర్యానీలో బొద్దింక ఉన్న వీడియోను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారింది.

ఇక ప్రమాణాలు పాటించని మెరిడియన్ రెస్టారెంట్‌( Meridian Restaurant ) పై తగు చర్యలు తీసుకోవాలని ఫుడ్ సేఫ్టీ అధికారులకు కస్టమర్ విజ్ఞప్తి చేశాడు.ఇక ఈ వీడియో చూసిన నెటిజన్స్ విరివిధా రకాలుగా స్పందించారు.

ప్రతిరోజు నగరంలో ఎన్ని ఘటనలు జరుగుతున్న గాని రెస్టారెంట్ యజమానులు మాత్రం తమకేమీ కాదనట్లుగా నిర్లక్ష్యం వహిస్తున్నారు అంటూ కొందరు కామెంట్ చేస్తుండగా.మరికొందరు ప్రజల ఆరోగ్యం ఏమైపోతే ఏమి.వారికి లాభాలు వస్తే చాలు అంటూ కామెంట్ చేస్తున్నారు.ఇంకొందరైతే.

ఇలాంటి రెస్టారెంట్లను వెంటనే సీజ్ చేయాలంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఏది ఏమైనా బయట రెస్టారెంట్లలో వందలకు వందలు పోసి రుచికరమైన ఆహ్వానం తినాలని భావించిన చాలామందికి ఇలాంటి సంఘటన వల్ల నిరాశే మిగులుతుంది.

కాబట్టి వీలైనంతవర కు ఇంటి భోజనం చేసేందుకు ప్రయత్నం చేయండి.లేకపోతే అనారోగ్యాలను కొని తెచ్చుకున్న వారమవుతాం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube