టిడిపి అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు( AP CM Chandrababu ) వ్యవహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.ఒకపక్క ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని ప్రధాన హామీలను అమలు చేసేందుకు కసరత్తు చేస్తూనే , ఏపీని పట్టిపీడిస్తున్న నిధుల కొరత కు గల కారణాలను ప్రజలకు వివరించి సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారు.
గత వైసిపి ప్రభుత్వం నిర్వాకంవల్ల ఏపీ ఖజానా ఖాళీ అయిందని, భారీగా అప్పులు పెరిగిపోయాయి అని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలకు ఇవన్నీ ఇబ్బందికరంగా మారాయని, వీటన్నిటిని ఒక గాడిన పెట్టి మళ్లీ ఏపీని అభివృద్ధి వైపు పరుగులు పెట్టిస్తానని ప్రజలకు అర్థమయ్యేలా చంద్రబాబు వివరించే ప్రయత్నం చేస్తున్నారు.ఈ మేరకు గత వైసిపి ( YCP )ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో జరిగిన అనర్ధాలు , ఆర్థిక లోటు పై ఇప్పటికే శ్వేత పత్రాలు విడుదల చేశారు.
అమరావతి మైనింగ్ కుంభకోణాలు , విద్యుత్ సంక్షోభం, పోలవరం పై నిర్లక్ష్యం వంటి వాటిపైన శ్వేత పత్రాలు విడుదల చేశారు.
ఇంకా ఏపీ ఆర్థిక పరిస్థితితో పాటు , ఎక్సైజ్, లా అండ్ ఆర్డర్ పై అసెంబ్లీలోనే జగన్ ( Jagan )ముందు శ్వేత పత్రాలు విడుదల చేయాలని చంద్రబాబు నిర్ణయించారు .నేరుగా అసెంబ్లీలో జగన్ ముందే ఈ శ్వేత పత్రాలను విడుదల చేయడం ద్వారా జగన్ ను ఇరున పెట్టవచ్చని చంద్రబాబు భావిస్తున్నారట.ముఖ్యంగా రకరకాల మద్యం బ్రాండ్స్ పేరుతో వచ్చిన చీఫ్ లిక్కర్ వాటిని తాగడం వల్ల జనాలు అనారోగ్యానికి గురవడం , మద్యపాన నిషేధం అమలు చేస్తామని చెప్పి ప్రజలను మోసం చేయడం, ఏపీ ఆర్థిక పరిస్థితి దివాలా తీసే విధంగా జగన్ తీసుకున్న నిర్ణయాలు వంటి వాటిని అసెంబ్లీలోనే జగన్ ముందు ఎమ్మెల్యేలకు వివరించే విధంగా ప్లాన్ చేశారు .
గత ఐదేళ్లలో వైసిపి ప్రభుత్వం లో చోటు చేసుకున్న అవినీతి అరాచకాలను చెప్పి అసెంబ్లీలోనే జగన్ నిలదీయబోతున్నారు. వీటిపై జగన్ సమాధానం కూడా ఏమిటనేది అసెంబ్లీ సాక్షిగానే ప్రజలకు అర్థమయ్యేలా చేసి , వైసీపీని, జగన్ ను మరింత ఇరుక్కున పెట్టే విధంగా చంద్రబాబు వ్యూహం రచిస్తున్నారు.