ఈ సినిమాల్లో డబల్ రోల్ లేకుండా ఉండి ఉంటే పెద్ద హిట్స్ అయ్యేవి !

మనం ఇది వరకే ఎన్నోసార్లు చెప్పుకున్నాం ప్రతి సినిమా కూడా దర్శకుడి విజన్ పై ఆధార పడి ఉంటుంది.ముందుగా ఒక కథ అనుకోని దానికి తగ్గట్టుగా స్క్రీన్ ప్లే ( Screenplay )రాసుకొని దానికి తో సెట్ పైకి వెళ్తారు.

 If These Movies Are Not With Double Role , Screenplay, Double Role, Skanda Movie-TeluguStop.com

అయితే ప్రతిసారి డైరెక్టర్ చెప్పిందే బాగుండకపోవచ్చు.కొన్నిసార్లు చూసేవారికి కూడా ఇలా ఉంటే బాగుంటుంది అని ఒక అంచనా ఈజీగా వస్తుంది.

అలా ఇప్పటి వరకు టాలీవుడ్ లో వచ్చిన కొన్ని డబల్ రోల్ కి సంబంధించిన మూవీస్ విషయంలో ప్రేక్షకులు తమకంటూ ఒక అంచనా తో ఇలా ఉంటే బాగుంటుంది అని అనుకుంటారు.అంటే డబల్ రోల్ తో వచ్చిన కొన్ని సినిమాల్లో అసలు అలా హీరో రెండు పాత్రల్లో కనిపించవలసిన అవసరం లేకుండా ఉండి ఉంటే బాగుండేది అని అనేకసార్లు అనిపించింది.

అలా అనిపించిన ఆ మూవీస్ ఏంటి ? ఆ హీరోలు ఎవరు ? అనే విషయాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

Telugu Double Role, Nani, Ram Pothineni, Screenplay, Shakti, Shyam Singaraya, Sk

నిన్న మొన్న వచ్చిన స్కంద సినిమా( Skanda movie ) చూస్తే అసలు ఇందులో రామ్ పోతినేని( Ram pothineni ) రెండు పాత్రలు చేయాల్సిన అవసరమే లేదు.చివర్లో కనిపించిన రెండవ పాత్ర లేకపోతేనే ఇంకా సినిమా బాగుండేది అనేది అప్పట్లో ప్రేక్షకులు అనుకున్నారు.ఇక శ్యామ్ సింగరాయ సినిమా( Shyam Singaraya movie ) గురించి ప్రత్యేకంగా ఈ సమయంలో చర్చించాలి.

ఎందుకంటే కేవలం బ్యాక్ డ్రాప్ లో సాయి పల్లవి తో నానికి సంబంధించిన ఎపిసోడ్ చాలా అద్భుతంగా వచ్చింది.ఇక ఫోటోగ్రాఫర్ గా నాని, కృతి శెట్టి జంటగా నటించిన సన్నివేశాలు లేకపోయి కేవలం బ్యాక్ డ్రాప్ తోనే సినిమా నడిపించి ఉండి ఉంటే అది మరో లెవెల్ లో ఉండి ఉండేది.

Telugu Double Role, Nani, Ram Pothineni, Screenplay, Shakti, Shyam Singaraya, Sk

శక్తి సినిమా( Shakti ) గురించి కూడా ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది.ఈ సినిమాలో రుద్ర పాత్రలో ఎన్టీఆర్ అసలు సెట్ కాలేదు.సినిమా కూడా చాలా దారుణంగా ఉంటుంది.పోలీస్ పాత్రతోనే ఈ సినిమా నడిపించి ఉండి ఉంటే కాస్తైనా ఆడి ఉండేది.ఇక నాని నటించిన మరో సినిమా కృష్ణార్జున యుద్ధం లో కూడా డబల్ రోల్ కాకుండా కేవలం కృష్ణ పాత్ర పైనే సినిమా ఉండి ఉంటే చాలా బాగుండేది.ఎందుకంటే రాక్ స్టార్ పాత్ర ఏ మాత్రం నానికి సెట్ కాలేదు.

ఈ సినిమాలన్నీ కూడా డబల్ రోల్ కాకుండా కేవలం ఏదో ఒక పాత్ర పైనే నడిచి ఉండి ఉంటే పెద్ద చిత్రాలుగా ఉండేవి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube