ఎలక్షన్స్ లో గెలిచింది ఓటరు మాత్రమే..చీల్చి చెండాడుతారు ..ఏ పార్టీ అయినా అంతే

2024 ఎలక్షన్స్( 2024 elections ) చాలా మందికి ఒక గుణపాఠం లాంటివి.అన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎలక్షన్స్ జరిగిన తీరు, ప్రజలు ప్రతిసారి తాము వ్యవహరిస్తున్న విధానం చెంపపెట్టు లాగానే ఉంటుంది.

 This Time Voter Only Won Elections , 2024 Elections, Won Elections, Andhra Prade-TeluguStop.com

ఆ పార్టీ ఓడిపోయింది లేదా ఈ పార్టీ గెలిచింది అనేకన్నా కూడా ఖచ్చితంగా ఓటరు మాత్రమే గెలుస్తున్నాడు అని చెప్పాలి.ఎవరు గెలిచినా ఎవరు ఓడినా దాని పరిణామం ఓటరు వేసిన ఓటు వల్లే జరిగింది.

w అందుకే ఓటర్ గీసిన గీత దాటి బయటకు వెళ్లే పరిస్థితి రాజకీయ నాయకులకు లేకుండా పోతుంది.ఐదేళ్ల పాటు అవినీతి చేయండి ఎంతనైనా ఎన్ని కోట్లు అయినా దోచేసుకోండి.

కానీ ఆ ఐదో ఏడు వచ్చే ఎలక్షన్స్ కి సిద్ధం కండి అన్నట్టుగా ఉంది ప్రస్తుతం ప్రజల ఓటు వేసే తీరు.

Telugu Andhra Pradesh, Pawan Kalyan, Time Voter Won, Won-Telugu Top Posts

ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ ( Andhra Pradesh Elections )తీసుకుంటే 2014లో గెలిచినా కూడా 2019లో 23 సీట్లను చూసుకొని చంద్రబాబు నాయుడు కన్నీళ్ళ పర్యంతమయ్యాడు.నేను 23 సీట్లు మాత్రమే గెలిచేంత ద్రోహం ఆంధ్రప్రదేశ్ కి ఏం చేశాను అని ఆయన అడిగాడు.అప్పుడు ఆయన చెప్పింది నిజమే అనిపించింది.

మరి అంత ద్రోహం ఏం చేశాడు అంటే ఓటరు ఎవరినైనా చీల్చి చెండాడుడుతారు.ఎంత అయోధ్య కఠినా కూడా అక్కడే బిజెపి ఊడిపోయింది అంటే ప్రజల మనసు ఎలా ఉంటుంది వారి ఓటు ఎలా పడుతుంది అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో అంచనా వేయడం చాలా కష్టమైన పని.ఒక్క సీటు కూడా గెలవలేనివి పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )కి 100% స్ట్రైక్ రేట్ ఇవ్వడం అంటే కూడా జీర్ణించుకోవడానికి చాలా కష్టం అసలు ఎలాంటి ప్రాధాన్యత లేని బీజేపీకి కూడా 10 సీట్స్ ఇస్తే అందులో ఎనిమిది గెలుచుకొచ్చారు.

Telugu Andhra Pradesh, Pawan Kalyan, Time Voter Won, Won-Telugu Top Posts

దాంట్లో బిజెపికి .టిడిపి( TDP , BJP ) నే నేతలను ఇచ్చి మరీ దగ్గరుండి గెలిపించుకుంది అనే అపవాదు ఉన్నప్పటికీ కూడా అంతిమంగా తేల్చేది నెంబర్ మాత్రమే.అందుకే ఇప్పుడు అధికారంలోకి వచ్చి ఎంత మెజారిటీ ఉన్నప్పటికీ ఈ ఐదేళ్లపాటు ఎవరు ఎలా పరిపాలిస్తారు అనే దానిపైన వచ్చే ఎలక్షన్స్ లో వారి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.

పోయిన.సారి జగన్ వచ్చాడు.దాన్ని ఎలాగు ఉపయోగించుకోలేక పోయాడు.ఈసారి బాబు వస్తే మాత్రం అలాగే ఉంటాడు అని నమ్మకం లేదు ఏ మాత్రం తేడా కొట్టినా 2019 ఫలితం మళ్లీ వస్తుంది.

సునామీ లాగా 11 నుంచి ఐదుకు పడిపోయిన ఆశ్చర్యపోనవసరం లేదు.అంతిమంగా గెలిచేది రాజకీయ పార్టీలు కాదు ఓటరు.

ఇది గుర్తుపెట్టుకుని రాజకీయాలు చేయాలి, పరిపాలన కొనసాగించాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube