ఇదేందయ్యా ఇది.. బహుశా ఆ ఇద్దరికీ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదేమో.. వీడియో వైరల్..

ఈ మధ్యకాలంలో తరచుగా అనేక వివాహ వేడుకలకు( Wedding ) సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడం గమనించి ఉంటాము.ముఖ్యంగా పెళ్లిళ్లలో జరిగే కొన్ని ఆసక్తికర సంఘటనల ద్వారా ఆ వీడియోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంటాయి.

 Couples Strange Reaction While Exchanging Garlands At Wedding Video Viral Detail-TeluguStop.com

ఇష్టమైన వారిని జీవితాంతం కలిసిపోయేందుకు పెళ్లి చేసుకుంటూ ప్రతి క్షణాన్ని స్పెషల్ గా ప్లాన్ చేసుకుంటున్నారు చాలామంది.అయితే కొందరు మాత్రం తమకు ఇష్టం లేకున్నా లేకపోతే పెద్దవారి కోసం వివాహం చేసుకుంటూ పెళ్లి జరుగుతుండగానే బాధపడిన సంఘటనలకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

తాజాగా ఇలాంటి కోవకు చెందిన మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇక ఈ వీడియో సంబంధించిన వివరాలు చూస్తే.

ప్రస్తుతం వైరల్ గా మారిన వీడియోలో ఏముందంటే.వధూవరులు ఇద్దరు దండలు( Garland ) మారుస్తున్న సమయంలో పెళ్లికి వచ్చిన అతిథులంతా టపాసులు కాలుస్తూ ఫుల్ జోష్ లో ఉన్నారు.ఇకపోతే ముందుగా వధువు వరుడు మెడలో దండను వేస్తుంది.ఆ సమయంలో దండ కాస్త తల పాగాకు తగులుకొని అలాగే ఉండిపోతుంది.అయినా సరే వరుడు( Groom ) ఆ దండను సరి చేసుకోకుండా అలాగే ఉండి వధువు మెడలో దండను విసిరేసినట్లుగా ఆమె మెడలో వేస్తాడు.అయితే ఆ దండ ఆమె మెడలో కాకుండా పూర్తిగా నడుము భాగం వరకు కిందికి జారిపోతుంది.

అలా జరిగిన కానీ వారిద్దరూ ఎటువంటి అలజడి లేకుండా అలాగే నిలుచుంటారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో పై సోషల్ మీడియాలో( Social Media ) నెటిజన్స్ రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు.కొందరైతే అసలు వీళ్ళిద్దరికీ పెళ్లి ఇష్టం లేకపోయినా.తల్లిదండ్రులు బలవంతంగా పెళ్లి చేస్తున్నట్లు అనిపిస్తున్నది అని కామెంట్స్ చేస్తుండగా మరికొందరైతే పెళ్లి ఇష్టం లేకపోతే అది ముందే చెప్పుకోవాలి.

కానీ., ఇలా అందరి ముందు ఫన్నీ చేస్తే ఏం బాగుంటుంది చెప్పండి అంటూ కాస్త వెరైటీగా కామెంట్ చేస్తున్నారు.

ఇంకెందుకు ఆలస్యం వైరల్ వీడియోను మీరు కూడా ఒకసారి వీక్షించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube