టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ( Nara Lokesh )విజయనగరంలో యువగళం సభ నిర్వహించారు.చంద్రబాబు( Chandrababu ) ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో యువతకు సంబంధించిన అనేక మంచి పనులు చేసినట్లు తెలిపారు.
ఒకపక్క ఉపాధి అవకాశాలు మరోపక్క.స్పోర్ట్స్ లో కూడా రాణించే విధంగా ఎన్నో స్టేడియాలు కట్టినట్లు పేర్కొన్నారు.
చంద్రబాబు విజన్ కలిగిన నాయకుడు.అన్ని రంగాలలో తెలుగువారిని పైకి తీసుకొచ్చే విధంగా.
ఆయన పాలన అందించారు.ఇదే సమయంలో పలువురు వేసిన ప్రశ్నలకు లోకేష్ సమాధానం ఇవ్వడం జరిగింది.
దీనిలో భాగంగా ఓ మహిళ వైసీపీ( YCP ) అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజా వేదిక కూల్చేసింది.తెలుగుదేశం పార్టీ కూడా ఆ రకంగానే వ్యవహరిస్తుందా.? అని ప్రశ్నించడం జరిగింది.దీనికి లోకేష్ సమాధానం ఇస్తూ.
చంద్రబాబుకి నిర్మించడం తప్ప కూల్చడం తెలియదని స్పష్టం చేశారు.పిల్లల భవిష్యత్తు కోసం నిరంతరం కష్టపడే చంద్రబాబుకి కట్టడమే తెలుసు అని పేర్కొన్నారు.
తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.తాడేపల్లి ప్యాలెస్ లోని ఒక్క ఇటుక కూడా కదల్చమన్నారు.
కూల్చడం తమ బ్లడ్ లోనే లేదని లోకేష్ స్పష్టం చేయడం జరిగింది.అదేవిధంగా రాజధాని గురించి మాట్లాడుతూ ఐదు కోట్ల ఆంధ్రులు గర్వపడే విధంగా నిర్మిస్తామని మాట ఇచ్చారు.
పక్క రాష్ట్రాలు మాత్రమే కాదు పక్క దేశాలు కూడా గుర్తించే విధంగా… రాజధాని అమరావతి( Amaravati ) నిర్మాణం చేపడతామని మాట ఇచ్చారు.