ఏపీలో మరో వారం రోజుల్లో కురుక్షేత్ర మహా సంగ్రామం జరగబోతుందని సీఎం జగన్( CM Jagan ) అన్నారు.రేపల్లె ప్రచార సభలో( Raypalle campaign meeting ) పాల్గొన్న ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
రానున్న ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకోవడానికే కాదని సీఎం జగన్ తెలిపారు.ఈ ఎన్నికల ఐదేళ్ల భవిష్యత్ ను నిర్ణయిస్తాయని పేర్కొన్నారు.
ఐదేళ్ల తమ పాలనలో ఎక్కడా లంచాలు, వివక్ష లేకుండా సంక్షేమ పథకాలను అందించామని తెలిపారు.గతంలో ఎప్పుడూ జరగని విధంగా అభివృద్ధి చేశామన్నారు.ఈ క్రమంలోనే చంద్రబాబును మళ్లీ నమ్మడం అంటే కొండచిలువ నోట్లో తలపెట్టడమేనని పేర్కొన్నారు.59 నెలల పాలనలో వైసీపీ తన మ్యానిఫెస్టోను 99 శాతం అమలు చేసిందని సీఎం జగన్ తెలిపారు.