వైరల్ పోస్ట్: పెళ్ళికి ముందే అసలు విషయం కనిపెట్టిస్తున్నట్టున్నాడు ఈ తమ్ముడు.. కావాలంటే పోస్ట్ చూడండి..

ప్రతి వ్యక్తికి జీవితంలో పెళ్లి( Marriage ) అనేది ఓ ప్రత్యేకమైన స్థానం కలిగి ఉంటుంది.జీవితంలో ఒక్కసారి చేసుకొని కార్యక్రమం అత్యంత వైభవంగా జరుపుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు.

 Anil Weds Samasya Viral Photo Going Viral On Social Media Details, Viral Video,-TeluguStop.com

పెళ్లి కార్డు( Wedding Card ) నుంచి పెళ్లి దుస్తులు, కళ్యాణమండపం, వచ్చిన బంధువులకు రిటర్న్ గిఫ్ట్స్ ఇలా అన్నిటి విషయాల్లో వారికి నచ్చేలా ఉండాలని కోరుకుంటూ కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తుంటారు.కాకపోతే ఒక్కోసారి పనులలో పొరపాట్లు దొర్లి నవ్వుల పాలవుతుంటారు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఓ వీడియో చూస్తే నిజంగా పొట్ట చెక్కలయ్యేలా అనిపిస్తుంది.ఇక ఈ విషయం సంబంధించి పూర్తి వివరాలకు వెళ్తే.

మామూలుగా కళ్యాణమండపం చేరుకునే సమయంలో పెళ్ళికొడుకు లేదా పెళ్లికూతురు ప్రయాణించే వాహనాలకు వారి ఇరువురి పేర్లకు సంబంధించిన స్టిక్కర్స్ అంటిస్తారు.ప్రస్తుతం వైరల్ గా మారిన వీడియోలో కూడా అలాంటిదే పెళ్లికారు రోడ్డుపై ప్రయాణిస్తుంది.ఆ కారు పై ఉన్న వధువు పేరు( Bride Name ) చూస్తే కాస్త గమ్మత్తుగా అనిపించింది.కారుపై ఉన్న స్టిక్కర్ లో ‘అనిల్ వెడ్స్ సమస్య’( Anil Weds Samasya ) అని రాసి ఉంది.

నిజానికి ఆ వధువు పేరు సమర్య.కాకపోతే తెలియకుండా జరిగిన ఆ తప్పుకు చూసిన వారు మాత్రం తెగ నవ్వుకోవడం వారి పని అయిపోయింది.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అతి తక్కువ సమయంలోనే లక్షల కొద్ది వ్యూస్ సంపాదించింది.ఇక ఈ వీడియోకు నెటిజెన్లు వారి స్టైల్ లో స్పందనలను తెలియజేస్తున్నారు.అందులో భాగంగా.కొందరైతే., పెళ్ళికొడుకు అనిల్ కు చాలా క్లారిటీ ఉంది.అందుకే కాబోలు పెళ్లికి ముందే అసలు విషయం తెలుసుకొని దానిని చూపించాడు అంటూ మెచ్చుకుంటున్నారు.

ఇక మరికొందరైతే పెళ్లి తర్వాత వధువు చేతిలో వరుడికి దెబ్బలు ఖాయమంటూ బెస్ట్ ఆఫ్ లక్ అనిల్ భయ్యా అని ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube