యానిమల్ ఓ చెత్త సినిమా.. చూస్తే చిరాకేసింది.. 12th ఫెయిల్ మూవీ నటుడి కామెంట్స్ వైరల్!

బాలీవుడ్ ప్రముఖ నటుడు రణ్ బీర్ కపూర్, రష్మిక హీరోహీరోయిన్లుగా సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో తెరకెక్కిన యానిమల్ మూవీ( Animal Movie ) బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచినా ఈ సినిమా విషయంలో విమర్శలు కొనసాగుతున్నాయి.తాజాగా 12th ఫెయిల్ మూవీ( 12th Fail Movie ) నటుడు సైతం ఈ సినిమాపై విమర్శలు చేయగా ఆ విమర్శలు హాట్ టాపిక్ అవుతున్నాయి.

 12th Fail Actor Vikas Comments About Animal Movie Details Here Goes Viral In So-TeluguStop.com

ఈ సినిమాలో నటించిన మాజీ ఐఏఎస్ వికాస్ దివ్యకృతి( Vikas Divyakriti ) ఈ సినిమా గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.

సమాజాన్ని యానిమల్ మూవీ పది సంవత్సరాలు వెనక్కు తీసుకెళ్తుందని ఆయన అన్నారు.

యానిమల్ లాంటి మూవీని అసలు తీసి ఉండకూడదని ఆయన కామెంట్లు చేశారు.యానిమల్ సినిమా తీసిన వాళ్లకు డబ్బులు వచ్చి ఉండవచ్చని వికాస్ అన్నారు.

కానీ ఈ సినిమాలో హీరోను జంతువులా చూపించారని ఆయన తెలిపారు.ఈ సినిమాలో హీరోయిన్ ను హీరో షూ నాకమనే సీన్ ఒకటి ఉంటుందని వికాస్ పేర్కొన్నారు.

ఈ సీన్ చూసి భవిష్యత్తులో యూత్ కూడా ఇలా ప్రవర్తిస్తే పరిస్థితి ఏంటని వికాస్ ప్రశ్నించారు.ఇలాంటి బుద్ధిలేని, కేర్ లెస్ సినిమాలను చూస్తుంటే బాధేస్తోందని ఆయన పేర్కొన్నారు.ఈ మూవీ చూస్తుంటే చిరాకు వేసిందని ఆయన తెలిపారు.వికాస్ కామెంట్లు నిజమేనని మరి కొందరు చెబుతున్నారు.వికాస్ చేసిన కామెంట్లపై సందీప్( Sandeep ) ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

యానిమల్ సినిమా కమర్షియల్ గా సక్సెస్ సాధించినా ఇలాంటి విమర్శల వల్ల ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.యానిమల్ సినిమాకు సీక్వెల్( Animal Sequel ) 2026లో తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.యానిమల్ మూవీ ఈ రేంజ్ లో ఉంటే యానిమల్ సీక్వెల్ ఏ రేంజ్ లో ఉండబోతుందో చూడాల్సి ఉంది.

వికాస్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube