ఏపీ సీఎం జగన్( AP CM Jagan ) పై జరిగిన దాడి ఘటనపై టీడీపీ నేత బోండా ఉమ( Bonda Uma ) కీలక వ్యాఖ్యలు చేశారు.రానున్న ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతోనే జగన్ గులకరాయి డ్రామాకు తెర తీశారని ఆరోపించారు.
గులకరాయి డ్రామాకు కేశినేని నాని( Kesineni Srinivas ), వెల్లంపల్లి శ్రీనివాస్ సూత్రధారులని బోండా ఉమ తెలిపారు.ఈ క్రమంలోనే కేశినేని నాని, వెల్లంపల్లి కాల్ డేటా బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.అదేవిధంగా ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.అయితే మేమంతా సిద్ధం బస్సు యాత్ర నిర్వహిస్తున్న సమయంలో సీఎం జగన్ పై దాడి జరిగిన సంగతి తెలిసిందే.