లైఫ్ లో కచ్చితంగా సక్సెస్ కావాలని ఎవరైనా నిర్ణయం తీసుకుంటే ఏదో ఒకరోజు వాళ్లు కోరుకున్న సక్సెస్ దక్కుతుంది.కెరీర్ పరంగా సక్సెస్ సాధించడం కోసం కష్టపడే వారికి ఆలస్యంగానైనా ఆశించిన ఫలితాలు వస్తాయి.
అలా కెరీర్ పరంగా సక్సెస్ సాధించిన వ్యక్తులలో సురేష్ పూజారి( Suresh Pujari ) కూడా ఒకరు.ఒకప్పుడు నెలకు 4 రూపాయల వేతనం అందుకున్న సురేష్ పూజారి నేడు 22 రెస్టారెంట్లకు యజమాని( Owner of 22 restaurants ) కావడం గమనార్హం.
బాల్యంలోనే సురేష్ పూజారికి ఎన్నో కష్టాలు ఎదురయ్యాయి.1950 సంవత్సరంలో పదేళ్ల వయస్సులో సురేష్ పూజారి రోజు కూలీగా చేరారు.ఆ సమయంలో పని దొరక్క ముంబైకు మకాం మార్చారు.చిన్న దాబాలో ఉద్యోగం సంపాదించిన సురేష్ కు నెలకు 4 రూపాయల జీతం వచ్చేది.ఆ తర్వాత సురేష్ పూజారి జ్యూస్ షాప్ లో చేరగా జీతం మాత్రం పెద్దగా పెరగలేదు.ఆ తర్వాత సురేష్ ఒక క్యాంటీన్ లో చేరగా అక్కడ జీతం ఆరు రూపాయలకు పెరిగింది.
ఒకవైపు పని చేస్తూనే మరోవైపు రాత్రిపూట స్కూల్ కు వెళ్తూ తొమ్మిదో వరకు సురేష్ చదువుకున్నాడు.ఆ తర్వాత సురేష్ సొంతంగా పావ్ భాజీ షాప్( Pav Bhaji Shop ) మొదలుపెట్టారు.ఆ బిజినెస్ లో సక్సెస్ దక్కడంతో సుఖ్ సాగర్ ( Sukh Sagar ) పేరుతో సురేష్ పూజారి రెస్టారెంట్లను మొదలుపెట్టారు.ప్రస్తుతం ఈ సంస్థకు దేశంలో ఏకంగా 22 బ్రాంచ్ లు ఉన్నాయి.
పావ్ భాజీ, పంజాబీ ఆహారాలకు సుఖ్ సాగర్ రెస్టారెంట్ ఫేమస్ అని చెప్పవచ్చు.
ప్రస్తుతం పలువురు సినీ ప్రముఖులు సైతం సుఖ్ సాగర్ రెస్టారెంట్లను మెచ్చుకుంటున్నారు.సురేష్ పూజారి సక్సెస్ స్టోరీకి ఫిదా అవుతున్నామని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.వ్యాపారంలో ఎన్నో ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమించి సుఖ్ సాగర్ ఈ స్థాయికి చేరుకున్నారు.