సిడ్నీ షాపింగ్‌ మాల్‌లో దుండగుడి బీభత్సం.. భారత సంతతి జంట ఎలా తప్పించుకుందంటే..?

ఆస్ట్రేలియాలోని సిడ్నీలో( Sydney ) గురువారం ఓ షాపింగ్ మాల్‌లో దుండగుడు కత్తితో విచక్షణరహితంగా దాడి చేసిన ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.నగరంలోని బిజీగా వుండే వెస్ట్‌ఫీల్డ్ బోండీ జంక్షన్‌లో( Westfield Bondi Junction ) ఈ ఘటన జరిగింది.

 Indian-origin Couple Narrates How They Survived Sydney Stabbing Carnage Details,-TeluguStop.com

సమాచారం అందుకున్న పోలీసులు మాల్‌లోకి ప్రవేశించి కాల్పులు జరిపారు.ఈ కాల్పుల్లో నిందితుడు మరణించాడు.

అయితే దుండగుడి బారి నుంచి ప్రాణాలను కాపాడుకునేందుకు పలువురు పరుగులు తీశారు.ఓ భారత సంతతికి జంట మాల్‌లోని బ్యాక్‌రూమ్‌లో దాక్కొన్నారు.

ఇతరులతో కలిసి కార్డ్ బోర్డ్ బాక్స్‌లను తమకు అడ్డుగా పెట్టుకున్నారు.

Telugu Australia, Australia Nri, Indian Origin, Shoi Ghoshal, Sydney, Sydney Car

సిడ్నీకి చెందిన షోయ్ ఘోషల్( Shoi Ghoshal ) అంతర్జాతీయ వార్తాసంస్థ బీబీసీతో తాము ఎలా తప్పించుకున్నది వివరించారు.బోండి జంక్షన్‌లోని వెస్ట్‌ఫీల్డ్ షాపింగ్ సెంటర్‌లో( Westfield Shopping Centre ) దాడి జరుగుతున్నప్పుడు లోపల తన భర్త దేబాషిస్ చక్రవర్తి,( Debashis Chakrabarty ) తాను వున్నామని ఆమె వెల్లడించారు.ఇంతలో అలజడి మొదలైందని.

కొందరు వ్యక్తులు దుకాణం లోపలికి దూసుకువస్తున్నట్లు తాము విన్నామని, తొలుత మంటలు చెలరేగాయని అనుకున్నామని ఘోషల్ వెల్లడించారు.అయితే ఎవరో కత్తితో పొడిచారని జనం చెప్పుకుంటున్నారని ఘోషల్ పేర్కొన్నారు.

దీంతో తాము బ్యాక్‌రూమ్, స్టోర్‌రూమ్‌లోకి వెళ్లి బారికేడ్‌ల మాదిరిగా పెట్టెలను అడ్డుగా పెట్టామని.తమతో పాటు లోపల 20 నుంచి 25 మంది వ్యక్తులు వున్నారని ఆమె వెల్లడించారు.

Telugu Australia, Australia Nri, Indian Origin, Shoi Ghoshal, Sydney, Sydney Car

బయట వున్న ఓ వృద్ధురాలు తన భర్త ఆచూకీ తెలియక ఏడుస్తోందని.ఇంతలో కొందరు పోలీసులకు సమాచారం అందించారని ఘోషల్ చెప్పారు.అనంతరం ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా వీరంతా మాల్ నుంచి తప్పించుకుని , పోలీసుల వద్దకు పరుగులు తీశారు.ఇది తాము జీవితంలో ఎదుర్కొన్న అత్యంత భయానక ఘటనగా ఆమె పేర్కొన్నారు.

నలుగురు మహిళలు, ఒక పురుషుడు ఘటనాస్థలిలోనే మరణించగా.మరో మహిళ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో ప్రాణాలు కోల్పోయినట్లు పోలీస్ అధికారులు వెల్లడించారు.

సిడ్నీలోని పలు ఆసుపత్రుల్లో 8 మంది చికిత్స పొందుతున్నారని వివరించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube