టిడిపి అధినేత చంద్రబాబుపై( Chandrababu ) మరోసారి తనదైన శైలిలో విమర్శలు చేశారు వైసీపీ అధినేత , ఏపీ సీఎం జగన్.( AP CM Jagan ) మేమంతా సిద్ధం పేరుతో రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర నిర్వహిస్తున్న జగన్, ఈరోజు మంగళగిరి నియోజకవర్గంలో( Mangalagiri Constituency ) పర్యటించారు.
ఈ సందర్భంగా చేనేత కార్మికులతో ముఖాముఖి అయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై విమర్శల వర్షం కురిపించారు.గత చంద్రబాబు పాలనను మీరంతా చూశారు.58 నెలల కాలంలో మీ బిడ్డ పాలనను చూశారు.ప్రతి పేదవాడి గుండెల్లో నిలిచేలా మీ బిడ్డ అడుగులు వేశాడు.58 నెలల పాలనలో జరిగిన అభివృద్ధిని ప్రజల నుంచి వింటున్నాను.
రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలకు సూచనలు తీసుకుంటున్నాను. చంద్రబాబుకు ఉన్నంత నెగెటివిటీ అనుభవం నాకు లేదు. చేనేత కార్మికులను కూడా చంద్రబాబు మోసం చేశాడు.2014లో కూటమిగా వచ్చి చంద్రబాబు ఏం చెప్పారో గుర్తు చేసుకోండి. ఓటు వేసేటప్పుడు అప్రమత్తంగా లేకపోతే మళ్లీ మోసపోతాం. గతంలో 98% హామీలను ఎగ్గొట్టారు, రెండు శాతం హామీలను మాత్రమే నెరవేర్చారు.గత పాలనను మన పాలనను తేడా మీరే గమనించారు.చంద్రబాబు రంగురంగుల మ్యానిఫెస్టోతో వస్తున్నారు.
సూపర్ సిక్స్, సెవెన్ అంటూ వస్తున్నారు.గతంలో కూడా ఈ ముగ్గురు కలిసి వచ్చారు.ఒక్కరైనా సెంటు స్థలం ఇచ్చారా ? మనం స్థలం ఇస్తే కోర్టుకు వెళ్లి అడ్డుకున్నారు.ఒక్క ఇళ్లయిన ఇచ్చారా ? చేనేత కార్మికులకు ఇల్లు, మగ్గం అని చంద్రబాబు మోసం చేశారు.నేతన్న నేస్తం పథకం( Netanna Nestham ) కింద 970 కోట్ల రూపాయలను చేనేత కార్మికులకు అందించాం.మగ్గం ఉన్న ప్రతి కుటుంబానికి చేయూత ఇచ్చింది మన ప్రభుత్వం.
కుల మత రాజకీయాలకు అతీతంగా లబ్ధి జరిగింది.గతంలో ఎప్పుడైనా ఇలాంటి పథకం అమలు చేసిన సందర్భం ఉందా ? నేతన్నల సంక్షేమం ,అభివృద్ధి కోసం 3706 కోట్లు ఖర్చు చేశాం.1.06 లక్షల మందికి లబ్ధి జరిగింది.
గతంలో లంచాలు ఇస్తే కూడా సంక్షేమ పథకం అందని పరిస్థితి ఉండేది అని జగన్ వివరించారు.పేదలకు మంచి జరిగితే అడ్డుకునేవాడు రాజకీయ నాయకుడా ? మేనిఫెస్టోలో( Manifesto ) చెప్పే ప్రతి హామీ నెరవేర్చిన ప్రభుత్వం మనది .మంగళగిరిలో పేదలకు 54 వేల ఇళ్ల స్థలాలు ఇస్తే చంద్రబాబు అడ్డుకున్నాడు.కోర్టులకు వెళ్లి పిటిషన్లు వేసి చంద్రబాబు అడ్డం పడ్డాడు.
మీ ఇళ్ల పట్టాలు అడ్డుకున్నది చంద్రబాబు.అందుకే ఓటు వేయమని అడిగినప్పుడు చంద్రబాబును నిలదీయండి అని జగన్ సూచించారు.