అమెరికా : బేకర్స్‌ఫీల్డ్ సిటీ కౌన్సిల్ సభ్యులకు బెదిరింపులు.. ఇండో అమెరికన్ మహిళ అరెస్ట్

కౌన్సిల్ సభ్యులు, మేయర్‌ను హత్య చేస్తామని బెదిరించినందుకు గాను భారతీయ అమెరికన్ మహిళను బేకర్స్‌ఫీల్డ్ సిటీ కౌన్సిల్ ఛాంబర్స్‌లో బుధవారం రాత్రి అరెస్ట్ చేశారు.రిధి పటేల్ (28)( Riddhi Patel ) పాలస్తీనా అనుకూల వ్యక్తి.

 Indian-american Protestor Riddhi Patel Arrested For Threatening To Bakersfield-TeluguStop.com

బెదిరింపులతో పాటు భయభ్రాంతులకు గురిచేయడానికి యత్నించడంపై 8 కౌంట్ల అభియోగాలు నమోదు చేసి జైలుకు పంపారు.అంతేకాదు.

ప్రసంగం సమయంలో సిటీ అధికారులను బెదిరించినందుకు మరో 8 కౌంట్ల గణనలు నమోదు చేశారు.తనపై వచ్చిన నేరారోపణలపై రిధి కన్నీరుమున్నీరుగా విలపించారు.

పబ్లిక్ కామెంటరీ కోసం నియమించబడిన కౌన్సిల్ సమావేశం( Council Meeting )లో పటేల్.ప్రతిపాదిత భద్రతా చర్యలకు , ప్రత్యేకంగా మెటల్ డిటెక్టర్ల ఏర్పాటుకు వ్యతిరేకంగా తన గళాన్ని వినిపించారు.

Telugu Andrae Gonzales, Riddhi Patel-Telugu NRI

నవరాత్రిని అణచివేతదారుల పండుగగా అభివర్ణించింది.సిటీ కౌన్సిల్ సభ్యులను బెదిరించే ముందు మహాత్మాగాంధీ( Mahatma Gandhi ) , యేసుక్రీస్తు పేర్లను ప్రస్తావించారు.పాలస్తీనా అనుకూల నిరసనకారుల ఉద్రేకపూరితమైన , దారుణమైన ప్రసంగం ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది.హిందూ అమెరికన్ ఫౌండేషన్ ఈ ఘటనపై స్పందించింది.బేకర్స్‌ఫీల్డ్ నాయకులను హత్య చేస్తానని బెదిరిస్తూ ఈమె గాంధీ, చైత్ర నవరాత్రిని కించపరిచేలా మాట్లాడిందని ఆగ్రహం వ్యక్తం చేసింది.రిధి పటేల్ ప్రసంగం సమయంలో అక్కడ వున్న కౌన్సిల్‌మన్, వైస్ మేయర్ ఆండ్రే గొంజాలెస్.

( Andrae Gonzales )కౌన్సిల్ ఈ బెదిరింపులకు లొంగదని పేర్కొన్నారు.సమస్యలను హుందాగా టేబుల్‌పై చర్చించాలని, ఇందుకు మార్గాన్ని ఎలా కనుగొనగలమో తెలుసుకోవడానికి ముందుకు వెళ్లాలని ఆండ్రే సూచించారు.

Telugu Andrae Gonzales, Riddhi Patel-Telugu NRI

ఎన్నికైన వారికి, నిర్ణయాధికారులను బెదిరింపులు చేయడం ఇతరులను ప్రభావితం చేసే మార్గం కాదన్నారు.సిటీ కౌన్సిల్‌లోని ఎవ్వరూ ఈ చర్యలకు భయపడరని ఆండ్రే చెప్పారు.యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్( United Liberation Front ) అనే పాలస్తీనా అనుకూల సంస్థ రిధి పటేల్ చర్యలను ఖండించింది.ఆమె దూకుడు భాష తమ సూత్రాలకు అనుగుణంగా లేదని, యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ వైఖరికి ప్రాతినిథ్యం వహించడంలో విఫలమైందని స్పష్టం చేస్తూ ప్రభుత్వ అధికారులపై బెదిరింపులను ఖండిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది.

కాగా.వివాదస్పదమైనప్పటికీ బేకర్స్‌ఫీల్డ్ సిటీ కౌన్సిల్ బుధవారం జరిగిన సమావేశంలో ఏకగ్రీవ సమ్మతితో మెటల్ డిటెక్టర్‌లతో సహా భద్రతా చర్యల మెరుగుదలలను ఆమోదించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube