రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రాగానే అనకాపల్లి దశ మారుస్తాం అని మాజీ మంత్రి, అనకాపల్లి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామకృష్ణ అన్నారు.రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం లోనికి రాగానే అనకాపల్లి దశ మారుస్తా మని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యా ణ్ చెప్పారని మాజీ మంత్రి, అనకాపల్లి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామ కృష్ణ అన్నారు.
ఈ మేరకు అనకాపల్లి పట్ట ణంలో జనసేన పార్టీ కార్యాలయంలో టిడిపి బీజేపీజనసేన నేతలతో కలిసి కొణతాల మీడియా సమావేశం నిర్వ హించారు.ఈ సందర్భంగా అనకాపల్లి లో పవన్ కళ్యాణ్ సభను విజయజవంతం చేసినందుకు ప్రజలందరికీ ప్రత్యేక కృతజ్ఞ తలు తెలిపారు.
కూటమితోనే రాష్ట్రానికి భవిష్యతు ఉందని, ప్రజలంతా విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయాలని పిలుపునిచ్చా రు.వారాహి విజయభేరి యాత్రలో పవన్ అనేక హామీలు ఇచ్చారన్నారు.యువత కు ఉపాధి, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి, మూతపడిన చక్కెర కర్మాగారాల పునరుద్ధరణ, విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్ష ణ మన ముందున్న సవాళ్లని, కూటమి అభ్యర్థులను గెలిపిస్తేనే ఇవన్నీ సాధ్యమ వుతాయన్నారు.రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసమే జనసేన పోరాడుతోందని,అధికారం కోసం కాదని పవన్ స్పష్టం చేశారని కొనతాల పేర్కొన్నారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ అనకాపల్లి నెహ్రూ చౌక్ లో నిర్వహించిన విజయభేరి యాత్ర కు జనం బ్రహ్మరథం పట్టారని అన్నారు .వేలాదిగా తరలివచ్చిన అభిమానులు, కూటమిలోని మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలకు అయన ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.కూటమితోనే రాష్ట్రానికి భవిష్యతు ఉందని, ప్రజలంతా విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయాలని పిలుపునిచ్చారు.యువతకు ఉపాధి, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి, మూత పడిన చక్కెర కర్మాగారాల పునరుద్ధరణ, విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ మన ముం దున్న సవాళ్లని, కూటమి అభ్యర్థులను గెలిపిస్తేనే ఇవన్నీ సాధ్యమవుతాయన్నా రు.రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసమే జన సేన పోరాడుతోందని, అధికారం కోసం కాదని పవన్ స్పష్టం చేశారని కొణతాల వెల్లడించారు.టిడిపి జిల్లా అధ్యక్షులు బుద్దా నాగ జగదీ ష్ మాట్లాడుతూ వైసీపీ పాలనలో రాష్ట్రం అదోగతి పాలయ్యింద ని, దీనిని బాగుంది చర్సెందుకు కేంద్రం మోడీ, రాష్ట్రంలో చంద్రబాబు సీఎం కావ లసిన ఆవశ్యకత వుందన్నారు.
పవన్ తన స్వార్ధం కోసం కాకుండా రాష్ట్ర అభి వృద్ధి కోసం తపిస్తున్నారని కొనియాడారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ నారాయణరావు, భీశెట్టి బాబ్జి , నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.