టిడిపి , జనసేన ,బిజెపిలు కూటమిగా( TDP Janasena BJP Alliance ) ఏర్పడడమే కాకుండా, సీట్ల పంపకాలు పూర్తి చేసి దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లోనూ అభ్యర్థులను ప్రకటించారు. పూర్తిగా ఎన్నికల ప్రచారంపైనే ఫోకస్ చేశారు.
అయితే పొత్తులో భాగంగా టిడిపి , జనసేన బిజెపి, అభ్యర్థులు పోటీ చేస్తున్న నియోజకవర్గాల విషయంలో మూడు పార్టీల్లోనూ గందరగోళం ఏర్పడింది.టిడిపి బలంగా ఉన్న నియోజకవర్గాల్లో బిజెపికి సీట్లు ఇవ్వడం , అలాగే జనసేనకు పట్టున్న ప్రాంతాల్లో టిడిపి సీట్లు తీసుకోవడం, బిజెపి బలహీనంగా ఉన్న స్థానాల్లో ఆ పార్టీకి సీటు కేటాయించడం వంటి వ్యవహారాలపై మూడు పార్టీల నాయకుల్లోను అసంతృప్తి ఉంది.
దీంతో ఆయా స్థానాల్లో ఓటమి తప్పదనే సంకేతాలు కూడా మూడు పార్టీల అధిష్టానాలకు వెళ్లడంతో కొన్నిచోట్ల కచ్చితంగా మార్పు చేర్పు చేపట్టాల్సిందేనని కూటమి నేతలు అభిప్రాయపడుతున్నారు.
ముఖ్యంగా నరసాపురం ఎంపీ స్థానంపై ఆశలు పెట్టుకున్న రఘు రామకృష్ణంరాజు కు( Raghurama Krishnam Raju ) మూడు పార్టీలు సీటు ఇవ్వలేదు.అక్కడ బిజెపి తమ అభ్యర్థిగా శ్రీనివాస్ వర్మను( Srinivas Varma ) ప్రకటించింది .అయితే రఘురామకు అక్కడ సీట్ ఇస్తే ఖచ్చితంగా గెలుస్తారనే అంచనాతో ఆయనకు సీటు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.దీనికోసం ఏలూరు సీటు బిజెపికి ఇచ్చి, నరసాపురం సీటును టిడిపికి ఇచ్చే విషయంపై తీవ్ర స్థాయిలోనే చర్చ జరుగుతుంది.రాష్ట్ర స్థాయిలోను కొన్ని స్థానాలపై ఇదేవిధంగా కసరత్తు జరుగుతుంది .అనపర్తి నియోజకవర్గంలో బిజెపి అభ్యర్థి బలహీనంగా ఉన్నారని, ఆ సీట్లో టిడిపి తమ అభ్యర్థిగా నల్లిమిల్లి రామకృష్ణారెడ్డిని( Nallimilli Ramakrishnareddy ) పోటీకి దింపే ఆలోచనలో ఉంది.బిజెపి నుంచి నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి పోటీ చేయమని ప్రతిపాదించినా, ఆయన ఆ పార్టీ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపించడం లేదు.
ఇక అనకాపల్లి ఎంపీ స్థానం పరిధిలో రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చాల్సిందిగా అనకాపల్లి బిజెపి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్( CM Ramesh ) డిమాండ్ చేస్తున్నారు.మాడుగులలో టిడిపి అభ్యర్థి పైల ప్రసాద్ గట్టిగా ప్రయత్నించలేకపోతున్నారని, ఆయన స్థానంలో బండారు సత్యనారాయణమూర్తి కి( Bandaru Satyanarayana Murthy ) అవకాశం ఇవ్వాలని సీఎం రమేష్ కోరుతున్నారు. జనసేన అభ్యర్థి సుందరపు విజయ్ కుమార్ సైతం వెనుకబడ్డారని , ఆయనకు బదులుగా ఇక్కడ బిజెపి అభ్యర్థిని పోటీకి దించాలని సీఎం రమేష్ డిమాండ్ చేస్తున్నారు .కొన్ని నియోజకవర్గాల్లో మార్పు చేర్పులు చేపట్టేందుకు మూడు పార్టీలు ఒకసారి సమావేశమై దీనిపై నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించుకున్నారట.