2024 ఎన్నికలకు సంబంధించి ఏపీలో పోటీ చాలా రసవత్తరంగా ఉంది.ఈసారి ఎన్నికలలో ఎవరు గెలుస్తారు అన్నది ఆసక్తికరంగా ఉంది.
ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ ఒంటరిగా పోటీ చేస్తుంది.ఆ పార్టీ అధినేత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి( CM Jagan Mohan Reddy ) దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు.
ఎన్నికల ప్రచారం విషయంలో మరియు పోటీ చేసే అభ్యర్థుల విషయంలో.మిగతా పార్టీల కంటే ముందంజలో ఉన్నారు.
ఆల్రెడీ 175 అసెంబ్లీ మరియు 24 ఎంపీ స్థానాల అభ్యర్థులు ప్రకటించడం జరిగింది.ఇక “సిద్ధం” జరిగిన జిల్లాలో మినహా మిగతా చోట్ల.
ఎన్నికల ప్రచారానికి జగన్ సిద్ధమవుతున్నారు.
మరోపక్క తెలుగుదేశం-బీజేపీ-జనసేన పార్టీలు మూడు కలిసి పోటీ చేస్తున్నాయి.2014లో ఏర్పడిన కూటమి మరోసారి ఏర్పడింది.ఎట్టి పరిస్థితులలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుడదని కూటమి నేతలు జాగ్రత్త పడుతున్నారు.
ఇదే సమయంలో ఎన్నికల ప్రచారం మరియు పోటీ చేసే అభ్యర్థుల విషయంలో వ్యూహాత్మకంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు.పరిస్థితి ఇలా ఉండగా లోక్ సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ( Jayaprakash Narayana ) ఎన్డీఏ కూటమికి( NDA Alliance ) మద్దతు ప్రకటించారు.‘సంక్షేమం, అభివృద్ధి సమతూకంగా ఉండాలి.ఆర్థిక భవిష్యత్తును కాపాడేవారు ఎవరని ప్రజలు ఆలోచించాలి.
రాష్ట్రంలో ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతాయా? ప్రజలను ఓటు వేయనిస్తారా? అనే అనుమానం కలుగుతోందన్నారు.సామాన్యుల జీవితాలు మారాలంటే నిర్భయంగా ఓటేయాలని జేపీ పిలుపునిచ్చారు.