తెలుగు సినిమా ఇండస్ట్రీకి 200 కోట్ల కలెక్షన్స్ అనేది మంచినీళ్లు తాగినంత ఈజీ.ఈ మధ్య వస్తున్న చాలా సినిమాలు 1000 కోట్లకు దగ్గరగా పరుగులు పెడుతున్నాయి.
కేవలం తెలుగులోనే ఇలా వందల కోట్ల వసూళ్లు సాధిస్తున్న సినిమాలు అనేకం ఉన్నాయి.అయితే మనది పెద్ద పరిశ్రమ.
మనం ఫ్యాన్ ఇండియా స్థాయికి ఎదిగేసాము.దాంతో మనకు 100 కోట్లు లేదా 200 కోట్లు తెలుగులో సాధించడం ఇండియా మొత్తం మీద ఒక 1000 కోట్లు బడ్జెట్ కలెక్ట్ చేయడం అనేది ఇప్పుడు చాలా ఈజీ టాస్క్.
కేవలం మనకు మాత్రమే కాదు కన్నడ, తమిళ్ భాషల్లో కూడా ఇలా 100, 200 కోట్లు ఇప్పుడు అవలీలగానే దాటేస్తున్నారు.కానీ మలయాళ సినిమా పరిశ్రమ చాలా చిన్న పరిశ్రమ.
అక్కడ 100 కోట్లు కలెక్షన్స్ రావడం అనేది చాలా పెద్ద విషయం.

కానీ 2024 సంవత్సరం వారికి బాగా కలిసి వచ్చింది.ఒకటికి రెండు సినిమాలు ఇప్పుడు 100 కోట్ల కలెక్షన్స్ దాటిస్తున్నాయి.అయితే మొట్టమొదటిసారి 200 కోట్లు కలెక్షన్స్ సాధించింది మళయాల చిత్ర పరిశ్రమ ఈ ఏడాది లోనే.
భ్రమయుగం,( Bramayugam ) ప్రేమలు( Premalu ) వంటి చిత్రాలు 100 కోట్ల దగ్గరగా ఉంటే మంజిమల్ బాయ్స్( Manjummel Boys ) మాత్రం ఏకంగా 200 కోట్ల రూపాయల కలెక్షన్స్ ని కొల్లగొట్టింది.ఇలా మొట్టమొదటిసారి 100 మరియు 200 కోట్లు కలెక్షన్స్ మలయాళ చిత్రపరిశ్రమ చూస్తూ చాలా క్రేజీ ఫీలవుతున్నారు.
అయితే తమిళ్లో మొట్టమొదటిసారి 200 కోట్లు దాటిన చిత్రం రోబో.( Robo ) శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా వచ్చిన ఈ సినిమా తమిళంలో మొట్టమొదటిసారి ఈ ఫీట్ సాధించింది.

ఇక తెలుగు విషయానికొస్తే బాహుబలి( Baahubali ) సినిమా మొట్టమొదటిసారి 200 కోట్లు మార్కు దాటింది.ఈ సినిమా 2015 లోనే 600 కోట్ల కలెక్షన్స్ దేశవ్యాప్తంగా వసూలు చేసింది.ఇక కన్నడ చిత్ర పరిశ్రమ విషయానికి వస్తే కేజిఎఫ్( KGF ) చిత్రంతోనే వారు మొట్టమొదటిసారి రెండు వందల కోట్ల కలెక్షన్స్ ని చూశారు.ఆ సినిమా దాదాపు 1000 కోట్ల రూపాయలను ఓవరాల్ గా ఇండియా మొత్తం వసూలు చేసింది.
రెండు పార్ట్స్ కూడా బ్రహ్మాండమైన విజయాన్ని అందుకున్నాయి.ఇలా దాదాపు 9 సంవత్సరాల క్రితం మనం 200 కోట్ల కలెక్షన్స్ చూస్తే మూడేళ్ల క్రితం కన్నడ చిత్ర పరిశ్రమ మరికొంత ముందుగానే తమిళ చిత్ర పరిశ్రమ ఈ ఫీట్ సాధించాయి.
మలయాళ చిత్ర పరిశ్రమ మాత్రం 2024 వరకు వేచి చూడాల్సి వచ్చింది.







