ప్రపంచవ్యాప్తంగా రంజాన్ మాసం ప్రారంభమయింది.నెలవంక కనిపించడంతో రంజాన్ మాసం( Ramadan ) స్టార్ట్ అయినట్లు.
ప్రకటన రావడం జరిగింది.దీంతో మార్చి 12 నుండి ముస్లింలు కఠిన ఉపవాసాలు ప్రారంభం కానున్నాయి.
ముస్లింలు ఎంతో పవిత్రంగా భావించే రంజాన్ మాసం ప్రారంభం నేపథ్యంలో ముస్లిం సోదర సోదరీమణులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు.నెల రోజులపాటు అత్యంత నియమా నిష్ఠలతో కఠిన ఉపవాస వ్రతం ఆచరించే ఈ పుణ్య రంజాన్ మాసం ముస్లింలకు ఎంతో పవిత్రమైనది.
రంజాన్ మాసంలోనే మహమ్మద్ ప్రవక్త ద్వారా దివ్య ఖురాన్ ఆవిర్భవించడంతో ముస్లిములు ఈ నెలకు అత్యంత ప్రాముఖ్యత ఇస్తారు.“మంచిలోనే చెడు భావాలని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపతూ మానవాళికి హితాన్ని బోధించే గొప్ప పండుగ రంజాన్.క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతన కలయకే జీవితమని రంజాన్ మాసం గొప్ప సందేశం ఇస్తుంది.కఠిన ఉపవాస దీక్ష ఆచరిస్తూ, దైవచింతనతో గడిపే ఈ మాసంలో ముస్లింలు తమ సంపాదనలో కొంత భాగాన్ని పేదలకు దానధర్మాల ద్వారా ఖర్చు చేస్తారు.
ముస్లింలకు అల్లాహ్ దీవెనలు లభించాలని కోరుతున్నా.రంజాన్ మాసం ప్రారంభం కానున్న సందర్భంగా ముస్లింలు అందరికీ శుభాకాంక్షలు” అని సీఎం జగన్( CM Jagan ) పేర్కొన్నారు.
ఈ మేరకు సీఎంఓ సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది.