Ashraf Zakky : ఫారినర్‌కు ఏటీఎం లోకేట్ చేయడంలో సాయపడ్డ ఆటో డ్రైవర్.. వీడియో వైరల్..

యూకేకి చెందిన జక్కీ( Zakky ) అనే వ్లాగర్ ప్రస్తుతం భారతదేశంలో పర్యటిస్తున్నాడు.అయితే ఇటీవల అతడికి కేరళలో ఒక సమస్య ఎదురయ్యింది.

 Video Of Auto Driver Helping Foreigner Locate Atm Goes Viral-TeluguStop.com

హోటల్ కార్డ్ మెషీన్ విరిగిపోయింది.దానివల్ల బిల్లు చెల్లించడానికి అతనికి క్యాష్ అవసరం అయింది.

ఏటీఎం దొరుకుతుందేమోననే ఆశతో ఫోర్ట్ కొచ్చి వైపు నడిచాడు.ఈ మార్గంలో స్థానిక ఆటో-రిక్షా డ్రైవర్ అష్రాఫ్ జక్కీ( Ashraf Zaki ) అసౌకర్యాన్ని గమనించి సహాయం అందించాడు.

ఇంగ్లీషులో బాగా మాట్లాడే అష్రఫ్, జక్కీని ఏటీఎంకు తీసుకెళ్లగలనని సూచించాడు.మొదట్లో, అపరిచితుడి నుంచి సహాయాన్ని కోరదామనే ఆలోచన జక్కీకి రాలేదు, అతను అపరిచిత వ్యక్తులను నమ్మకూడదని కూడా అనుకున్నాడు.

కానీ అష్రఫ్ నమ్మదగినది వాడిలా ఉన్నట్లు అతను గ్రహించాడు.అందుకే ఏటీఎం( ATM ) పనిచేయకపోవడంతో ఆందోళన చెందినా రైడ్‌కు అంగీకరించాలని నిర్ణయించుకున్నాడు.

అష్రఫ్ దయగల వ్యక్తి అని నిరూపించుకున్నాడు.అతను జక్కీకి ATMని కనుగొనడంలో సహాయం చేశాడు, నగరం చుట్టూ తిరిగి చూపించడానికి కూడా ప్రతిపాదించాడు.అయితే, జక్కీ ఏటీఎంను మాత్రమే ఉపయోగించాల్సి ఉంది, కాబట్టి అతను ఎక్కువ టైం వేస్ట్ చేయలేనని అష్రఫ్‌ను కోరాడు.తన మాటను నిజం చేస్తూ, తన నిజాయితీని ప్రదర్శిస్తూ జక్కీని దించి అష్రఫ్ వెళ్లిపోయాడు.

జక్కీ ఈ అనుభవాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు, అష్రాఫ్ చేసిన సహాయానికి సంబంధించిన వీడియోను కూడా పంచుకున్నాడు.ఈ వీడియోకు ఒక కోటి పాతిక లక్షల దాకా వ్యూస్ వచ్చాయి.అనేక లైక్స్‌, కామెంట్స్ తో ఈ వీడియో బాగా పాపులర్ అయింది.అష్రఫ్ దయ, అవసరంలో ఉన్న అపరిచితుడికి సహాయం చేయాలనే మంచితనాన్ని నెటిజన్లు మెచ్చుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube