కృష్ణా జిల్లా మైలవరం టీడీపీ పంచాయతీ ఉత్కంఠ రేపుతుంది.ఈ మేరకు నియోజకవర్గం టీడీపీలో కీలక నేతలు అంతా ఎవరికి వారే అన్న రీతిలో వ్యవహారిస్తున్నారని తెలుస్తోంది.
పార్టీ క్యాడర్ లతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.ఇందులో భాగంగా టీడీపీ నేత దేవినేని ఉమా( Devineni Uma ) రానున్న ఎన్నికల్లో మైలవరం నియోజకవర్గం నుంచి తానే పోటీ చేస్తానని చెబుతున్నారు.
ఈ క్రమంలోనే ఈనెల 21 నుచి ఎన్నికల ప్రచారం ప్రారంభించేందుకు కార్యాచరణను సైతం రూపొందించారని తెలుస్తోంది.
మరోవైపు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వసంత కృష్ణ ప్రసాద్ సైతం మైలవరం సీటు ఆశిస్తూ టీడీపీ( TDP )లో చేరే యోచనలో ఉన్నారని తెలుస్తోంది.ఈ నేపథ్యంలో దేవినేని ఉమా, వసంతలో ఒకరిని పెనమలూరుకు టీడీపీ పంపాలని భావిస్తుంది. వసంత కృష్ణ ప్రసాద్ పై దేవినేని ఉమా తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు.
దీంతో మైలవరం నియోజకవర్గంలో టీడీపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.