ఏపీలో త్వరలో ఎన్నికలు( AP Elections ) సమీపిస్తున్న తరుణంలో అధికార పార్టీ వైసీపీ ‘సిద్ధం’( Siddham ) పేరిట సభలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.ఇందులో భాగంగా ఇవాళ అనంతపురం జిల్లా రాప్తాడు సమీపంలోని బైపాస్ రోడ్డు వద్ద సిద్ధం సభకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది.ఈ క్రమంలో సిద్ధం సభలో పాల్గొనేందుకు మధ్యాహ్నం 3.15 నిమిషాలకు సీఎం జగన్( CM YS Jagan ) రాప్తాడుకు చేరుకోనున్నారు.
అయితే ఈ సభా వేదికగా వైసీపీ మ్యానిఫెస్టోపై సీఎం జగన్ మాట్లాడతారని ఇప్పటికే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి( Minister Peddireddy Ramachandra Reddy ) వెల్లడించిన సంగతి తెలిసిందే.కాగా ఈ సిద్ధం సభకు రాయలసీమ జిల్లాల నుంచి ప్రజలు వేలాదిగా తరలిరానున్నారు.