Sukhdev Vaid : టెక్ సపోర్ట్ పేరుతో చీటింగ్.. వృద్ధురాలి నుంచి 1.50 లక్షల డాలర్ల వసూలు , అమెరికాలో భారతీయుడికి జైలుశిక్ష

అమెరికాలోని మోంటానా( Montana in America ) రాష్ట్రంలో ఓ వృద్ధ మహిళను 1.50 లక్షల డాలర్లను మోసం చేసిన ఘటనలో భారతీయుడికి నాలుగేళ్లకు పైగా శిక్ష విధించింది కోర్ట్.నిందితుడిని హర్యానా రాష్ట్రానికి చెందిన 24 ఏళ్ల సుఖ్‌దేవ్ వైద్‌గా( Sukhdev Vaid ) గుర్తించారు.ఇతను అంతర్జాతీయ కంప్యూటర్ హ్యాకింగ్ స్కీమ్ ద్వారా వృద్ధ అమెరికన్లను లక్ష్యంగా చేసుకున్నట్లు అంగీకరించాడు.అలా అమెరికా వ్యాప్తంగా పలువురిని 1.2 మిలియన్ డాలర్ల మేర మోసం చేసినట్లుగా యూఎస్ అటార్నీ జెస్సీ లాస్లోవిచ్ బుధవారం తెలిపారు.కస్టడీ నుంచి విడుదలైన తర్వాత దేశం నుంచి బహిష్కరించేలా బ్యూరో ఆఫ్ కస్టమ్స్ అండ్ ఇమ్మిగ్రేషన్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు వైద్‌ను రిమాండ్ చేయాలని కోర్ట్ ఆదేశించింది.అంతేకాకుండా జరిగిన నష్టానికి గాను $1,236,470ను చెల్లించాల్సిందిగా తీర్పు వెలువరించింది.

 Indian National Sentenced For Stealing 150000 From Elderly Woman In Us-TeluguStop.com
Telugu Laslovich, Bureau Customs, Montana America, Shohini Sinha, Sukhdev Vaid-T

మనదేశం వెలుపల వున్న వ్యక్తులు మోంటానా వాసులను బలి పశువులను చేయడం సర్వసాధారణంగా మారిందని అటార్నీ లాస్లోవిచ్( Attorney Laslovich ) ఆవేదన వ్యక్తం చేశారు.ప్రత్యేకించి ఇది వైర్ ఫ్రాడ్‌కు సంబంధించినది కావడంతో దాని నుంచి బయటపడటం సాధ్యం కాదని అటార్నీ తెలిపారు.ఫాంటమ్ హ్యాకర్ స్కామ్ లేయర్ టెక్ సపోర్ట్ ద్వారా ఆర్ధిక, ప్రభుత్వానికి చెందిన వ్యక్తుల కంప్యూటర్లను , వ్యక్తిగత సమాచారాన్ని యాక్సెస్ చేయవచ్చని సాల్ట్ లేక్ సిటీ ఎఫ్‌బీఐ స్పెషల్ ఏజెంట్ ఇన్‌ఛార్జ్ షోహిని సిన్హా( Shohini Sinha ) అన్నారు.ఈ తరహా ఘటనల్లో ఎక్కువగా వృద్ధులే లక్ష్యంగా మారుతున్నారని సిన్హా పేర్కొన్నారు.

వృద్ధులైన అమెరికన్ల నుంచి $1,236,470 దొంగిలించడంలో భారత్‌కు చెందిన ఓ సంస్థ ప్రమేయం వున్నట్లుగా కోర్టు పత్రాలలో పేర్కొంది.

Telugu Laslovich, Bureau Customs, Montana America, Shohini Sinha, Sukhdev Vaid-T

ఫిబ్రవరి 2023లో మోంటానా కేసు చోటు చేసుకుంది.కాలిస్‌పెల్‌లోని జేన్ డో( Jane Doe in Kalispell ) అనే 73 ఏళ్ల మహిళ ఈ విధంగా మోసపోయినట్లు గ్లేసియర్ బ్యాంక్ .ఎఫ్‌బీఐకి ఫిర్యాదు చేసింది.కేటుగాళ్లు జేన్ డో.కంప్యూటర్ స్క్రీన్‌పై కనిపించేలా పాప్ అప్ నోటీస్ ద్వారా మోసం చేశారు.జేన్ డో‌ను మీ కంప్యూటర్ హ్యాకింగ్‌కు గురైంది.కస్టమర్ సపోర్ట్ కోసం ఓ నెంబర్‌కు కాల్ చేయాల్సిందిగా నోటీసులో పేర్కొన్నారు.అప్పటి నుంచి కేటుగాళ్లు చెప్పినట్లే చేసిన జేన్ డో.వారికి 1.50 లక్షల డాలర్ల నగదును ఇచ్చింది.స్కామ్ గురించి తెలుసుకున్న అనంతరం ఎఫ్‌బీఐ కేటుగాళ్ల కోసం వల పన్నింది.

దీనిలో భాగంగా జేన్ డో తన వద్ద ఇంకా 50 వేల డాలర్ల నగదు వుందని మోసగాళ్లకు చెప్పింది.ఫ్లోరిడాలోని గైనెస్‌విల్లేకు చెందిన ఎడ్లీ జోసెఫ్ సహా కొందరు డబ్బును తీసుకునేందుకు మోంటానాకు వెళ్లినప్పుడు ఎఫ్‌బీఐ వారిని అరెస్ట్ చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube