రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు బిగ్ బాస్ కంటెస్టెంట్ ఆదిరెడ్డి( Adireddy ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.అయితే బిగ్ బాస్( Bigg Boss ) హౌస్ కి వెళ్ళకముందు వరకు ఆదిరెడ్డి ఎవరు అన్న విషయం చాలా మందికి తెలియదు.
కానీ బిగ్ బాస్ హౌస్ తో ఒక్కసారిగా భారీగా పాపులారిటీని సంపాదించుకున్నాడు ఆదిరెడ్డి.అంతేకాకుండా బిగ్ బాస్ షో ఆదిరెడ్డి జీవితాన్ని మార్చేసిందని చెప్పవచ్చు.
ఒకప్పుడు ఆదిరెడ్డి బెంగుళూరులో చిన్న జాబ్ చేసుకుంటూ ఆర్థిక కష్టాలతో ఇబ్బందులు పడేవాడు.అతడు బిగ్ బాస్ షో గురించి మాట్లాడే తీరు చూసి ఫ్రెండ్స్ వీడియోలు చేయమని సలహా ఇవ్వడంతో అలా అనుకోకుండా బిగ్ బాస్ రివ్యూవర్ గా( Bigg Boss Reviewer ) మారాడు ఆదిరెడ్డి.
అలా బాగా ఫేమస్ అయ్యాడు.అతని యూట్యూబ్ వీడియోలకు లక్షల్లో వ్యూస్ రావడం స్టార్ట్ అయ్యింది.అలా వచ్చిన ఫేమ్ తో ఏకంగా బిగ్ బాస్ షోలో ఛాన్స్ దక్కించుకున్నాడు.బిగ్ బాస్ సీజన్ 6 లో( Bigg Boss 6 ) పాల్గొన్న ఆదిరెడ్డి ఫైనల్ కి వెళ్ళాడు.4వ స్థానంలో నిలిచాడు.ఆదిరెడ్డి కామనర్ కోటాలో హౌస్లో అడుగుపెట్టడం విశేషం.
ఇది ఇలా ఉంటే ఆదిరెడ్డి ఇటీవల కాలంలో తరచూ ఏదో ఒక విషయంతో వార్తలు నిలుస్తూనే ఉన్నారు.తాజాగా కూడా మరోసారి ఆదిరెడ్డి పేరు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తోంది.
అయితే తాజాగా ఆదిరెడ్డికి ఓ సమస్య వచ్చిపడింది.సాయం కావాలంటూ ప్రతి ఒక్కరు నేరుగా ఇంటికి వస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ విషయంపై అభిమానులుకు ఆదిరెడ్డి విజ్ఞప్తి చేశారు.దయచేసి ఎవరూ కూడా ఇలా రావొద్దంటూ రిక్వెస్ట్ చేస్తూ వీడియో రిలీజ్ చేశారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.ఆది రెడ్డి మాట్లాడుతూ.దయచేసి అర్థం చేసుకోండి.
నాకు తోచిన సహాయం( Help ) నేను చేస్తున్నాను.నాకు వీలైనంత సాయం చేస్తూనే ఉంటాను కానీ డైరెక్ట్‌గా ఇంటికి చాలా మంది వస్తున్నారు.
వాళ్ల అందరికి నేనేం చేయగలను చెప్పండి.ఎవరు వచ్చినా ఆహారం అంటే ఒకరోజు పెట్టించగలను.
కానీ వాళ్ల బాధలన్నీ చెప్పినా నేను ఏం చేయలేని పరిస్థితి.దయచేసి ఎవరు కూడా ఇంటికి కానీ, సెలూన్‌కు కానీ రావొద్దు.
సమాజానికి నా వంతు కృషి చేస్తాను.అంతే కానీ అందరికి చేయలేను కదా.ఎలాగోలా వచ్చిన వాళ్లకి ఛార్జీలకి ఇచ్చి పంపుతున్నాను.దయచేసి అర్థం చేస్కోండి.
తప్పుగా అనుకోవద్దు ప్లీజ్.నాతో మాట్లాడాలంటే కామెంట్స్, మెసేజేస్ ద్వారా పంపండి అంటూ విజ్ఞప్తి చేశారు ఆదిరెడ్డి.