ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో మూడు నెలలలో ఎన్నికలు రాబోతున్నాయి.ఈ క్రమంలో రాజకీయంగా చోటు చేసుకుంటున్నా పరిణామాలు ఏపీ రాజకీయాలనీ రసవతరంగా మారుస్తున్నాయి.
జనవరి మొదటి వారంలో వైయస్ షర్మిల( YS Sharmila ) కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం తెలిసిందే.ఈ క్రమంలో నేడు ఏపీ పీసీసీ చీఫ్ అధ్యక్షురాలి పదవిని షర్మిలాకి కాంగ్రెస్ పెద్దలు కట్టబెట్టడం జరిగింది.
ఈ నేపథ్యంలో పలువురు వైసీపీ పార్టీకి చెందిన నేతలు… షర్మిలకి కాంగ్రెస్ హైకమాండ్ పీసీసీ చీఫ్ పదవి అప్పజెప్పటం పట్ల.సోషల్ మీడియా వేదికగా సంచలన కామెంట్స్ చేస్తున్నారు.
ఈ రకంగానే మంత్రి అంబటి రాంబాబు( Ambati Rambabu ) ట్విట్టర్ లో ‘Dr.YSR, AP Congress.కీ౹౹శే.లే!’ అని కామెంట్ చేశారు.
ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.దేశంలో కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ ఉన్నకొద్ది పెరుగుతూ ఉంది.ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో కాంగ్రెస్ గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కర్ణాటక మరియు తెలంగాణ రాష్ట్రాలలో అధికారం కైవసం చేసుకుంది.ఇక ఇదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మళ్లీ పుంజుకోవడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంది.
ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి కీలకమైన ఓటు బ్యాంకు ఉండేది.దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉండే సమయంలో కాంగ్రెస్ రెండు సార్లు అధికారంలోకి రావడం జరిగింది.
అయితే ఏపీ విభజన ప్రక్రియ ఇష్టానుసారంగా జరగడంతో ఏపీలో పూర్తిగా కాంగ్రెస్ కనుమరుగయింది.గత రెండు సార్వత్రిక ఎన్నికలలో ఏపీలో కాంగ్రెస్ కి డిపాజిట్లు కూడా దక్కలేదు.
కానీ రాహుల్ గాంధీ( Rahul Gandhi ) “జోడోయాత్ర” తర్వాత… పార్టీ గ్రాఫ్ పెరుగుతూ ఉంది.ఈ క్రమంలో ఏపీలో వైఎస్ షర్మిలకి పార్టీ పగ్గాలు అప్పజెప్పడం సంచలనంగా మారింది.