కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న భారత్ న్యాయ యాత్ర ఈ నెల 14 నుంచి ప్రారంభం కానుంది.మణిపుర్ నుంచి ముంబై వరకు రాహుల్ గాంధీ న్యాయ యాత్ర కొనసాగనుంది.
ఈ యాత్ర సుమారు 6,700 కిలో మీటర్ల మేర రాహుల్ గాంధీ యాత్ర చేయనున్నారు.యాత్రలో భాగంగా వంద లోక్ సభ స్థానాలు, 337 అసెంబ్లీ స్థానాలను కవర్ చేయనున్నట్లు తెలిపారు.
అలాగే ఈ యాత్ర కోసం కాంగ్రెస్ శ్రేణులు సిద్ధం కావాలని ఇప్పటికే పార్టీ నేతలు సూచించిన సంగతి తెలిసిందే.కాగా భారత్ న్యాయ యాత్రలో దేశంలోని సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ అంశాలను ప్రస్తావించనున్నారని తెలుస్తోంది.