లోక్ సభ ఎన్నికల సన్నద్ధతపై కాంగ్రెస్ కీలక సమావేశం నిర్వహించింది.ఈ మేరకు ఏఐసీసీ కార్యాలయంలో తెలంగాణ సమన్వయకర్తలతో భేటీ అయ్యారు.
ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, సీతక్క హాజరయ్యారు.తెలంగాణ తరువాత కర్ణాటక సమన్వయకర్తలతో అధిష్టానం సమావేశం కానుంది.
అలాగే సాయంత్రం 5 గంటలకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ సమన్వయకర్తలతో పార్టీ హైకమాండ్ భేటీ కానుంది.