రెండు తెలుగు రాష్ట్రాల్లోని 90 శాతం స్క్రీన్లలో గుంటూరు కారం మూవీ( Guntur Karam ) రిలీజ్ అవుతోంది.కొన్ని ఏరియాలలో గుంటూరు కారం బుకింగ్స్ వేరే లెవెల్ లో ఉండగా మరికొన్ని ఏరియాలలో మాత్రం ఈ సినిమా బుకింగ్స్ పుంజుకోవాల్సి ఉంది.
గుంటూరు కారం సినిమాకు తెలంగాణలో 65 రూపాయలు, 100 రూపాయల చొప్పున టికెట్ రేట్ల పెంపుకు అనుమతులు లభించగా ఏపీలో 50 రూపాయల మేర టికెట్ రేట్ల పెంపు లభించింది.
అయితే సలార్ సినిమాకు( Salaar ) 40 రూపాయల పెంపుకు అనుమతులు ఇచ్చిన జగన్ సర్కార్ గుంటూరు కారం సినిమాకు 50 రూపాయల పెంపుకు అనుమతులు ఇచ్చింది.
వాస్తవానికి గుంటూరు కారం సినిమాతో పోల్చి చూస్తే సలార్ రేంజ్ ఎక్కువనే సంగతి తెలిసిందే.గుంటూరు కారం సినిమాతో పోల్చి చూస్తే సలార్ సినిమాలో విజువల్ ఎఫెక్స్ట్ కు కూడా ఎక్కువగా ప్రాధాన్యత ఉందనే సంగతి తెలిసిందే.
జగన్ సర్కార్( Jagan Government ) ఒక్కో హీరోకు, ఒక్కో సినిమాకు టికెట్ రేట్ల పెంపు విషయంలో వేర్వేరు రూల్స్ ను ఫాలో అవుతుందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.జగన్ సర్కార్ పవన్ సినిమాల( Pawan Movies ) విషయంలో మాత్రం కఠినంగా వ్యవహరిస్తోందని ఆరోపణలు ఉన్నాయి.జగన్ సర్కార్ గతంలో టికెట్ రేట్ల( Ticket Rates ) పెంపుకు సంబంధించి కొన్ని రూల్స్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే.
అయితే పెద్ద సినిమాల విషయంలో ఆ రూల్స్ ఎంతవరకు అమలవుతున్నాయో అర్థం కావడం లేదు.హీరో, డైరెక్టర్ పారితోషికాలతో సంబంధం లేకుండా 100 కోట్ల రూపాయల బడ్జెట్ దాటిన సినిమాలకే టికెట్ రేట్ల పెంపు ఉంటుందని రూల్స్ ఉన్నాయి.అయితే ఆ రూల్స్ పాటించకపోయినా కొన్ని సినిమాలకు టికెట్ రేట్ల పెంపు అమలవుతోందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
మరోవైపు గుంటూరు కారం రిజల్ట్ మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.