అడవి జంతువులకు ఎదురుపడినప్పుడు వాటి చేతుల్లో ప్రాణాలు కోల్పోక తప్పదు.కొన్నిసార్లు వాటిని బెదిరించి ఎలాగోలా పారిపోవడం సాధ్యమవుతుంది.
మరికొన్నిసార్లు పక్కనే ఉన్న మనుషులు మానవత్వం చూపించి కాపాడుతుంటారు.తాజాగా ఒక మహిళను కూడా కొందరు కాపాడారు.
దీనికి సంబంధించిన వీడియో ట్విట్టర్ వేదికగా చక్కర్లు కొడుతోంది.క్రేజీ క్లిప్స్( Crazy clips ) అనే ప్రముఖ ట్విట్టర్ పేజీ ఈ వీడియోను షేర్ చేసింది.
దీనికి ఇప్పటికే ఒక కోటి 44 లక్షల వ్యూస్ వచ్చాయి.
వైరల్ అవుతున్న వీడియోలో ఒక పోలార్ బీయర్ ( Polar Bear )మహిళపై దాడి చేయడం చూడవచ్చు.ఆమె చాలా నిస్సహాయక స్థితిలో కింద పడిపోయింది.అప్పుడు ధ్రువపు ఎలుగుబంటి ఆమెను తన పంజాతో రెండు దెబ్బలు కొట్టింది.
అనంతరం ఆమె ప్యాంటు లేదా వీపు చర్మాన్ని నోటితో పట్టుకొని లాగింది.ఈ షాకింగ్ విజువల్స్ చూసిన స్థానిక ప్రజలు బిగ్గరగా అరవడం మొదలుపెట్టారు.
ఎలుగు బంటి మహిళపై దాడి చేసిన ప్రతిసారి గట్టిగా అరిచి దాని గుండెల్లో గుబులు రేపారు.దాంతో భయపడిన ఎలుగుబంటి ఆ మహిళను వదిలేసి తన దారిన తాను వెళ్ళిపోయింది.
తర్వాత మహిళ లేచి నిల్చోని అక్కడి నుంచి ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని పారిపోవడం మనం చూడవచ్చు.ఆ సమయంలో ఆమె ప్యాంటు జారిపోయింది.
అందువల్ల త్వరగా ఉరకలేకపోయింది.ఎలుగుబంటి దాడి వల్ల తగిలిన షాక్ నుంచి ఆమె అప్పటికీ తేరుకోలేదు.
బహుశా ఆమె డ్రింక్ చేసి ఉంటే ఏమో అని వీడియో చూసిన కొంతమంది కామెంట్లు చేశారు.ఏది ఏమైనా ప్రాణాలతో బయటపడడం నిజంగా ఆమె అదృష్టం అని చెప్పుకోవచ్చు అలాగే స్థానిక ప్రజలు ఆమె ప్రాణాలను కాపాడడంలో కీలకపాత్ర పోషించారు.ఈ ఘటన ఒక ఫారిన్ కంట్రీలో జరిగినట్లు తెలుస్తోంది కానీ ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగిందనే వివరాలు మాత్రం తెలియ రాలేదు.