డార్క్ అండర్ ఆర్మ్స్ కు ఇక గుడ్ బై.. వారంలో నలుపును మాయం చేసే రెమెడీ మీ కోసం!

స్లీవ్ లెస్ దుస్తులు వేసుకున్నప్పుడు అందరి చూపులు అండర్ ఆర్మ్స్ పై పడటం సర్వసాధారణం.అందుకే అండర్ ఆర్మ్స్ తెల్లగా మరియు మృదువుగా మెరిసిపోతూ కనిపించాలని కోరుకుంటారు.

 Say Goodbye To Dark Underarms With This Home Remedy! Dark Underarms, Home Remedy-TeluguStop.com

కానీ అటువంటి అండర్ ఆర్మ్స్ ను పొందడం అంటే అంత సుల‌భం కాదు.మనలో చాలామంది డార్క్ అండర్ ఆర్మ్స్ తో సఫర్ అవుతుంటారు.

అండర్ ఆర్మ్స్ నల్లగా ఉంటే ఇష్టమైన దుస్తులు వేసుకోలేరు.పైగా ఈ సమస్యను బయటకు చెప్పుకునేందుకు కూడా మక్కువ చూపరు.

మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే అస్సలు వర్రీ అవ్వకండి.డార్క్ అండర్ ఆర్మ్స్ కు ఇక గుడ్ బై చెప్పే సమయం వచ్చింది.ఇప్పుడు చెప్పబోయే హోమ్ రెమెడీని కనుక పాటిస్తే వారం రోజుల్లో అక్కడి నలుపును మాయం చేసుకోవచ్చు.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో అరకప్పు బంగాళాదుంప ముక్కలు( Potato slices ), అర కప్పు కీర దోసకాయ ముక్కలు( Green cucumber slices ) వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

Telugu Tips, Dark Underarms, Remedy, Latest, Skin Care, Skin Care Tips, Underarm

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుండి జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ బియ్యం రవ్వ( Rice bran ), వన్ టేబుల్ స్పూన్ ఆరెంజ్ పీల్ పౌడర్( Orange Peel Powder ), వన్ టేబుల్ స్పూన్ షుగర్ పౌడర్, వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ వేసుకుని కలుపుకోవాలి.చివరిగా సరిపడా బంగాళదుంప కీరా దోసకాయ జ్యూస్ కూడా వేసి మరోసారి అన్నీ కలిసేలా మిక్స్ చేసుకోవాలి.

Telugu Tips, Dark Underarms, Remedy, Latest, Skin Care, Skin Care Tips, Underarm

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అండర్ ఆర్మ్స్ లో అప్లై చేసుకుని రెండు నుంచి మూడు నిమిషాల పాటు స్క్రబ్బింగ్ చేసుకోవాలి.ఆపై ఐదు నిమిషాల పాటు ఆరబెట్టుకుని అప్పుడు వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.రోజుకి ఒకసారి ఈ రెమెడీని కనుక పాటిస్తే అండర్ ఆర్మ్స్ లో ఉన్న న‌లుపు మొత్తం క్రమంగా మాయం అవుతుంది.

కొద్ది రోజుల్లోనే మీ అండర్ ఆర్మ్స్ తెల్లగా కాంతివంతంగా మారతాయి.అందంగా మెరుస్తాయి.కాబట్టి డార్క్ అండర్ ఆర్మ్స్ తో బాధపడుతున్న వారు తప్పకుండా ఈ హోమ్ రెమెడీని ట్రై చేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube