విజయవాడలోని ఇంద్రకీలాద్రికి భవానీలు పోటెత్తారు.భవానీ దీక్షలు(Bhavani Deeksha) ముగింపు దశకు చేరుకోవడంతో పెద్ద సంఖ్యలో కనకదుర్గమ్మ ఆలయానికి( Kanakadurga Temple ) బారులు తీరారు.
పూర్ణాహుతితో భవానీ దీక్షలు ముగియనున్నాయి.గత ఐదు రోజులుగా దుర్గమ్మను దర్శించుకుని సుమారు 5.5 లక్షల మంది భవానీలు దీక్ష విరమణ చేశారని తెలుస్తోంది.
అమ్మవారిని దర్శించుకుని ఇరుముడి సమర్పించుకుంటున్నారు.
ఈ నేపథ్యంలోనే ఇవాళ, రేపు కూడా అమ్మవారి దర్శనం కోసం భక్తులతో పాటు భవానీలు కూడా భారీగా తరలివచ్చే అవకాశం ఉంది.భవానీల రద్దీతో ఆలయ అధికార యంత్రాంగం అప్రమత్తం అయింది.
భక్తులకు( Devotees ) ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు.