బీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తున్న చేవెళ్ల పార్లమెంట్ సన్నాహాక సమావేశంలో గ్రూప్ విభేదాలు తెరపైకి వచ్చాయి.మాజీ మంత్రి మహేందర్ రెడ్డి మాట్లాడేందుకు మైకు తీసుకోగా మాజీ ఎమ్మెల్యే ఫైలట్ రోహిత్ రెడ్డి వర్గం నేతలు అడ్డుకున్నారు.
మహేందర్ రెడ్డి మాట్లాడటంపై రోహిత్ రెడ్డి వర్గం నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు.దీంతో రెండు వర్గాలకు చెందిన నేతల మధ్య వివాదం చెలరేగింది.
ఈ క్రమంలోనే ఆరు వర్గాలను పార్టీ నేతలు సర్దిచెప్పడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.అయితే గత మూడు రోజులుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన పార్లమెంట్ సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.