ప్రభాస్ ప్రశాంత్ నీల్( Prashanth Neel ) కాంబినేషన్ లో సినిమా అంటే రికార్డులు సులువుగానే బ్రేక్ అవ్వాలి.ఫస్ట్ వీకెండ్ లో సలార్ మూవీ కళ్లు చెదిరే స్థాయిలో కలెక్షన్లను సాధించింది.
అయితే వీకెండ్ తర్వాత వసూళ్లలో డ్రాప్ మొదలవగా ఇప్పటికీ ఆ డ్రాప్ కొనసాగుతోంది.ఫుల్ రన్ లో సలార్ 800 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించే అవకాశం ఉంది.
కొన్ని ఏరియాలలో ఈ సినిమా హిట్ గా నిలిచినా మరికొన్ని ఏరియాలలో మాత్రంబ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ లేదు.
కేజీఎఫ్2 మూవీ ఫుల్ రన్ లో 1200 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించగా సలార్ మూవీ ఆ కలెక్షన్లను బ్రేక్ చేసే ఛాన్స్ అయితే లేదు.అయితే సలార్ మూవీ కేజీఎఫ్2 కలెక్షన్లను బ్రేక్ చేయలేకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి.సలార్ సినిమా ఉగ్రమ్ కు రీమేక్ గా తెరకెక్కడంతో ఉగ్రమ్ మూవీ చూసిన కన్నడ ప్రేక్షకులు ఈ సినిమాను మళ్లీ థియేటర్లలో చూడటానికి ఇష్టపడలేదు.
సలార్ సినిమాకు సరైన స్థాయిలో ప్రమోషన్స్ జరగకపోవడం కూడా మైనస్ అవుతోంది.సలార్ సినిమాలో ప్రభాస్( Prabhas ) రోల్ కు నిడివి తక్కువగా ఉండటం, డైలాగ్స్ తక్కువగా ఉండటం కూడా మైనస్ అయిందని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.సలార్ మూవీ విషయంలో వస్తున్న నెగిటివ్ కామెంట్ల గురించి ప్రశాంత్ నీల్ సైతం తమ తప్పు లేదనే విధంగా జవాబిస్తున్నారు.సలార్2( Salaar 2 ) సినిమా స్క్రిప్ట్ పనులు ఇప్పటికే పూర్తి కాగా ఈ సినిమా కథ, కథనంలో ఎలాంటి మార్పులు ఉండబోవని తెలుస్తోంది.సలార్2 మూవీ 2025 లేదా 2026లో మొదలయ్యే ఛాన్స్ ఉంది.సలార్2 మూవీ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే ఈ సినిమా రేంజ్ మరింత పెరుగుతుందని చెప్పవచ్చు.సలార్2 మూవీకి ట్విస్టులు హైలెట్ గా నిలవనున్నాయని సమాచారం అందుతోంది.