బాలీవుడ్ నటి పాయల్ ఘోష్ ( Payal Ghosh ) అంటే తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.ఈమె ఎన్టీఆర్ నటించిన ఊసరవెల్లి సినిమాలో తమన్నా స్నేహితురాలుగా చేసింది.
అలాగే ఈమె తెలుగు లో చేసిన మొదటి సినిమా ప్రయాణం.అంతేకాకుండా మిస్టర్ రాస్కెల్ ( Mr.Rascale ) సినిమాలో కూడా చేసింది.అయితే పాయల్ ఘోష్ ఆ తర్వాత బాలీవుడ్ లో కొన్ని సినిమాలు,వెబ్ సిరీస్ లు కూడా చేసింది.
ఇక బాలీవుడ్ బ్యూటీ అయినా పాయల్ ఘోష్ బాలీవుడ్ ఇండస్ట్రీపై ఎప్పటికప్పుడు సంచలన కామెంట్స్ చేస్తూనే ఉంటుంది.బాలీవుడ్ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఎక్కువగా ఉంటుందని, బాలీవుడ్ తో పోలిస్తే తెలుగు ఇండస్ట్రీనే చాలా గొప్ప అంటూ ఈమె చేసిన కామెంట్లు అప్పట్లో సంచలనం సృష్టించాయి.

ఇక ఎప్పుడూ ఏదో ఒక వివాదానికి తెరలేపుతూ ఉండే పాయల్ ఘోష్ తాజాగా విడుదలైన సలార్ అలాగే ఢంకీ రెండు సినిమాలు చాలా చెత్తగా ఉన్నాయి అని రివ్యూ ఇచ్చి ఆ హీరోల అభిమానులకు కోపాన్ని తెప్పించింది.అంతేకాకుండా ఎన్టీఆర్ ( NTR ) గురించి ఒక విషయాన్ని బయట పెట్టింది అదేంటంటే.ఎన్టీఆర్ తమన్నా కాంబినేషన్ లో వచ్చిన ఊసరవెల్లి ( Oosaravelli ) సినిమాలో పాయల్ ఘోష్ కూడా ఓ కీలక పాత్రలో చేసింది.అయితే ఈ సినిమాలో చేసే సమయంలో థాయిలాండ్ లో ఓ రోజు షూటింగ్ జరిగేటప్పుడు పాయల్ ఘోష్ రోడ్డు మీద బట్టలు మార్చుకుందట.

ఇక ఇది చూసిన జూనియర్ ఎన్టీఆర్ ( Jr.NTR ) చాలా కోపంతో ఆమెను తిట్టారట.ఇక ఈ విషయాన్ని స్వయంగా పాయల్ ఘోష్ చెప్పుకొచ్చింది.అంతేకాదు సౌత్ ఇండియా లో ఉండే వారికి ఆడవాళ్లు అంటే చాలా గౌరవం ఉంటుంది.అందుకే జూనియర్ ఎన్టీఆర్ నన్ను అలా తిట్టారు అంటూ చెప్పుకొచ్చింది.ప్రస్తుతం ఈ విషయం నెట్టింట్లో వైరల్ అవ్వడంతో ఎన్టీఆర్ అభిమానులు మా హీరో ఎప్పుడూ అంతే మహిళలను చాలా గౌరవిస్తారు అంటూ కామెంట్లు పెడుతున్నారు.