పవన్ తో పొత్తు ఉన్నా.. ఆ పార్టీ కోసం ఎదురుచూపులు ! 

వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని టిడిపి అధినేత చంద్రబాబు ( Chandrababu )చాలా పగడ్బంది వ్యూహాలే రచిస్తున్నారు.ఒకవైపు జనసేన పార్టీతో పొత్తు కొనసాగిస్తున్నా,  మరోవైపు బిజెపితో పొత్తు కోసం చేయని ప్రయత్నాలు లేవు.

 Despite The Alliance With Pawan.. Looking Forward To That Party , Tdp, Chandra-TeluguStop.com

ప్రస్తుత ఏపీ అధికార పార్టీ వైసీపీని వచ్చే ఎన్నికల్లో ఘోరంగా ఓడించాలంటే,  కచ్చితంగా కేంద్ర అధికార పార్టీ బిజెపి సహకారం ఉండాల్సిందేనని బాబు బలంగా నమ్ముతున్నారు.దీనికి తోడు వివిధ సర్వేల్లో మరోసారి కేంద్రంలో బిజెపి నే అధికారంలోకి రాబోతుందని తేలడంతో బాబు ముందుగానే అలర్ట్ అవుతున్నారు.

ఒకవేళ ఏపీలో టీడీపీ,  జనసేన( TDP Jana Sena ) ప్రభుత్వం ఏర్పడినా,  కేంద్రం నుంచి తగిన సహకారం లేకపోతే ముందుకు వెళ్లలేని పరిస్థితి ఉంటుందని బాబు గ్రహించారు.అందుకే పెద్దగా బలం లేకపోయినా, కేంద్రంలో తప్పనిసరిగా సహకారం కావాల్సిందేనని బాబు అంచనా వేస్తున్నారు.

అందుకే బీజేపీని కూడా పొత్తు కోసం ఒప్పించి,  అవసరం అయితే ఎక్కువ స్థానాలను పొత్తులో భాగంగా కేటాయించేందుకు కూడా సిద్ధమనే సంకేతాలను ఇస్తున్నారు.

Telugu Ap, Central, Chandrababu, Jagan, Janasena-Politics

 ఇక బిజెపి ( BJP )కూడా ఏపీలో బలపడాలని ఎప్పటి నుంచో ప్రయత్నిస్తోంది.  ఒకవేళ టిడిపి తో పొత్తు గనుక పెట్టుకుంటే .దాదాపు పది స్థానాలకు పైనే ఎంపీ సీట్లను తీసుకోవాలనే ఆలోచనతో ఉందట.2019 ఎన్నికల్లో బిజెపికి టిడిపి దూరంగా ఉండడం, రాష్ట్రంలో ప్రతిపక్షంగా ఉండాల్సి రావడం,  కేంద్రంలో తమకు అనుకూలమైన ప్రభుత్వం లేకపోవడంతో, ఈ నాలుగున్నర ఏళ్లు చంద్రబాబు తీవ్ర రాజకీయ ఇబ్బందులు ఎదుర్కొన్నారు .అంతేకాదు చంద్రబాబు అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లారు.

Telugu Ap, Central, Chandrababu, Jagan, Janasena-Politics

బిజెపితో కలిసి ఉంటే తమకు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని , ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు.  ప్రస్తుతం జనసేనతో పొత్తు,  రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్( Prashant Kishor ) వ్యూహాలు ఇవన్నీ తమకు కలిసి వస్తాయని , బిజెపి అండ దండలు కూడా ఉంటే రాష్ట్రంలో తమకు తిరుగే ఉండదనే అంచనాలో టిడిపి ఉంది .అందుకే బిజెపి కోరినన్ని స్థానాలను ఇచ్చి ఏపీలో అధికారంలోకి వచ్చే విధంగా చంద్రబాబు వ్యవహరచన చేస్తున్నట్లు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube